నందిగామ,ఆగస్టు08 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేసి సత్తా చాటుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ధీమా వ్యకం చేశారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ కొడిచర్ల శ్రీనివాస్, అప్పల యాదయ్య, కొడిచర్ల వెంకటేశ్, నీరటి యాదయ్య, ఏనుగొండ శేఖర్ తదితరులకు బీఆర్ఎస్ పార్టీలో చేశారు. వారికి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోతుందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉందని, కలిసిగట్టుగ పనిచేసి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ గొవిందు అశోక్, నాయకులు దేవేందర్యాదవ్, కొస్గి శ్రీనివాస్, కట్న శ్రీశైలం, సత్యం భూపాల్, శేఖర్, ఆంజనేయులు, సాయి తదితరులు పాల్గొన్నారు.