మాడ్గుల, మే16 : గ్రామీణ పేదలకు ఉపాధి హమీ చట్టాన్ని దూరం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు. మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హమీ కూలీలు పని చేస్తున్న ప్రదేశాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించు కోవాలని డిమాండ్ చేశారు. అలాగే మే 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ, ఉపాధి హమీ కూలీలతో మహధర్నా జరుగుతుంది. మహధర్నాను జయప్రదం చేయాలని కూలీలను కోరారు. భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలోని మండల కార్యదర్శి పాషా, బుచ్చయ్య, సంధ్య, వెంకటమ్మ, కృష్ణయ్య, పాపమ్మ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.