వికారాబాద్/ఆదిబట్ల : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన చేపట్టారు. రూ.18 వేల కనీస వేతనం ఇస్తా మన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేం డ్లు అవుతున్నా మాట నిలబెట్టుకోకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలు, ఆయాల ను పోలీసులు లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. గేట్ల ఎదుటే ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, ఆయాల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అం గన్వాడీ యూనియన్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ తదితరులు మాట్లాడు తూ.. ఈ సమావేశాల్లోనే అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాం డ్ చేశారు. జీవోనం.14ను, 2026 ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే సవరించాలని.. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు. సీఐటీయూ నాయకులు రామకృష్ణ, చంద్రయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, మనోహర, మంజుల, భారతమ్మ, రేణుక, సంతోష, సుజాత పాల్గొన్నారు.

Rr1