ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే : ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్, జులై 7 : ప్రతి పక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుట్టి మహేష్‌తో పాటు సుమారు 20మంది టీడీపీ, కాంగ్రెస్‌పార్టీల కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన కార్యకర్తలకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ..ఎన్నికలెప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షపార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు రానున్న రోజుల్లో పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ మంచిరెడ్డి వెంకట ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, నాయకులు నర్సింహ, కిషన్‌రెడ్డి, చంద్రయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

