చేవెళ్లటౌన్, మే 25 : నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు డీలర్లను హెచ్చరించారు. ఆదివారం చేవెళ్లలోని రైతు వేదికలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై డీలర్లకు అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ.. వ్యాపార ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైన పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారులు హరినాథ్, సురేశ్రావు, డీలర్లు పాల్గొన్నారు.