వీడియో కాన్ఫరెన్స్‌తో రైతులకు మేలు
రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లతో అన్నదాతలకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాటు చేసిన నెట్వర్క్ సిస్టమ్‌ను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు.
- జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి
మొయినాబాద్, మార్చి 6 : రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లతో అన్నదాతలకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాటు చేసిన నెట్వర్క్ సిస్టమ్‌ను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు చేపడుతున్న నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం రైతు వేదికల్లో వీసీలను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పర్యటనలో రైతులతో ముఖాముఖిగా సంభాషించడంతో పాటు నేరుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు. నేటి ఆధునిక పోకడలకు అనుగుణంగా రైతులు వ్యవసాయ రంగంలో రాణించేందుకు ఇలాంటి కాన్ఫరెన్స్‌లు దోహదపడుతాయన్నారు. వ్యవసాయ నిపుణుల సూచనలతో సాగులో సులువు పద్ధతులను పాటించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, మొయినాబాద్ క్లస్టర్ ఏఈవో సునీల్, కేతిరెడ్డిపల్లి క్లస్టర్ ఏఈవో కుమార్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

