రంగారెడ్డి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : రైతులు పండిస్తున్న పంటల సాగును డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) పట్ల వ్యవసాయ విస్తరణాధికారులు విముఖత చూపుతున్నారు. సిబ్బంది కొరత, పనిఒత్తిడి వంటి కారణాలతో సర్వే చేయలేం! అంటూ చేతులెత్తేశారు. సర్వే చేసేందుకు గల ఇబ్బందులపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా.. సర్వే చేయాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టడం పట్ల ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కే 49 రకాల విధులతో సతమతమవుతున్న తమకు సర్వే తలకుమించిన భారంగా మారిందని వాపోతున్నారు. కొద్దిరోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూనే ఏఈవోలు విధు లు నిర్వర్తిస్తుండగా..డిజిటల్ క్రాప్ సర్వే ప్రశ్నార్థకంగా మారింది.
డిజిటల్ క్రాప్ సర్వే కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏఈవోలకు శిక్షణ ఇచ్చి.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను వారికి అందజేసింది. అయి తే ఎంతో పకడ్బందీగా నిర్వహించే ఈ సర్వేను సహాయకులు లేకుండా చేపట్టడం సాధ్యం కాద ని ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారులు)లు పేర్కొంటున్నారు. జిల్లాలోని 87 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 1,23,398 హెక్టార్లలో డిజిటల్ సర్వేను చేపట్టాల్సి ఉన్నది. రైతులకు సంబంధించిన 10,73,416 ఫామ్స్‌ను క్షేత్రస్థాయిలో క్షు ణ్ణంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది.
ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 20 వేల ఫామ్స్ ఉం డగా..25 మీటర్లకు ఒక్కో ఫొటో తీయాలి. ఈ లెక్కన ఆ విస్తీర్ణంలో ఎన్ని రకాల పంటలను సాగు చేస్తే..వేర్వేరుగా ఆ పంటల ఫొటోలను తీయాల్సిందే. దీంతో 8,500 ఎకరాలు ఉన్న క్లస్టర్లో లక్షకు పైగా ఫొటోలు తీసి ప్రత్యేక యా ప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న 68 మంది ఏఈవోలతో ఇదేలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏఈవో లు రుణమాఫీ, రైతుబీమా, పీఎం కిసాన్, పం ట నష్టం సర్వే వంటి పనుల్లో బిజీగా ఉన్నారు.
త్వరలోనే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన పనుల్లోనూ తలమునకలు కానున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే పేరిట మరింత భారాన్ని మోపడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం చేపడుతున్న ఈ సర్వేలో పక్క రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. సహాయకులను నియమిస్తే సర్వేకు సహకరిస్తామని చెబుతున్నా.. తమ మాటలను ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏఈవోల నుంచి నిరసన వ్యక్తం కావడంతో డిజిటల్ క్రాప్ సర్వేకు బ్రేక్ పడింది. ఇప్పటికే డీసీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పంటల సా గు వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేయాల్సిన ఏఈవోలు నల్లబ్యాడ్జీలు ధరించే విధులకు హాజరవుతున్నారు. సహాయకులను నియమిస్తే సర్వే చేపడతామని కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులకు వేర్వేరుగా వినతిపత్రాలను సైతం అందజేశారు.
ఏఈవోలు ఒక్కరే సర్వే చేయ డం సాధ్యపడదని వారు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్వే చేసేందుకు ఏఈవోలు ఎందుకు నిరాకరిస్తున్నారో.. వారి సమస్యలేమిటో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఏఈవోల నుంచి సహాయ నిరాకరణ ఎదురవడంతో సర్వే ఆగిపోయింది.