BRS Party | మొయినాబాద్, ఏప్రిల్12 : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.. వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఫించన్లు అందించాలి. కేసీఆర్ పెంచిన ఫించన్ తప్ప సీఎం రేవంత్‌రెడ్డి ఏమీ పెంచలేదు. ఆయన చల్లగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మాకు వచ్చిన ఫించన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ఇస్తున్నానని స్వచ్ఛందంగా వచ్చి డబ్బులు ఇచ్చారు.
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ మహాసభకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి శనివారం మొయినాబాద్ మున్సిపాలిటి కేంద్రంలోని స్ఠార్ కన్వెన్షన్‌లో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటి పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన న్యాలట నర్సమ్మ, న్యాలట యాదమ్మ, న్యాలట పాపమ్మ, మంగళి బిక్షపమ్మలు కలిసి చందాగా రూ.5 వేల నగదును ఎన్కేపల్లి బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి రాము ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితారెడ్డికి అందించారు.
10 ఏండ్ల క్రితం రూ.2 వందలు ఉన్న ఫించన్‌ను కేసీఆర్ సీఎం అయిన తరువాత రూ. 2 వేలు ఇచ్చిండు. అదే ఫించన్ వస్తుంది. మా ప్రభుత్వం వస్తే రూ.4 వేలు ఇస్తామని కాంగ్రేసోళ్లు చెప్పడంతో కేసీఆర్‌కు ఓట్లు వేయకుండ కాంగ్రేసోళ్లకు వేసి మోసపోయాము. ఇప్పటి వరకు రూ. 4 వేలు రావడం లేదు. మళ్లీ కేసీఆర్ సార్ రావాలని మా ఫించన్ డబ్బులు ఇచ్చామని మాజీ మంత్రి సబితారెడ్డికి తెలిపారు. సభకు స్వచ్చంధంగా డబ్బులు ఇచ్చిన ఫించన్ లబ్దిదారులను మాజీ మంత్రి సబితారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహ్మరెడ్డి, షేక్ బహాబూబ్, ఎంఏ రావూఫ్, జయవంత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మోర శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు సుధాకర్‌యాదవ్, దారెడ్డి శోభా, మంజూల, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.