Youth Suicide | మొయినాబాద్, ఫిబ్రవరి18 : మరో పదహారు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు.. పాడె ఎక్కి భూమాత ఒడిలో కలిసిపోయాడు. ఈ హృదయ విదారకర ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన ఎం సాయికుమార్(32) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి కుటుంబ సభ్యులు వివాహ సంబంధం కూడ నిర్ణయించి వచ్చే మార్చి 6వ తేదిన పెళ్లి మూహుర్తం పెట్టుకున్నారు. వివాహం సంబంధం కుదిరిన తరువాత పెళ్లి కూతురు, ఆమె బాబాయ్, వారి బంధువులు సాయికుమార్‌ను వేధించారు. వారి వేధింపులతో సాయికుమార్ మానసికంగా బాధ పడ్డాడు. వేధింపులు భరించడం కన్న చనిపోవడం మంచిదని భావించి, మానసికంగా చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు.
అయితే సాయికుమార్ ఈ నెల 17వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి వీడియో రికార్డు చేసి చనిపోతున్నానని బంధువులందరికి పంపాడు. సాయికుమార్ తల్లి , అతని బంధువులు కలిసి సాయికుమార్ కోసం వెతకడం ప్రారంభించారు. అతని ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు సాయికుమార్ గండిపేట చౌరస్తాలో చెట్టుకు ఉరేసుకున్న దృశ్యం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసి, భాస్కర దవఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. మృతుడి తల్లి నా కుమారుడు చావడానికి కారణం పెళ్లి కూతురు, పెళ్లి కూతురు బాబాయ్‌లు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.