Heart Attack | మొయినాబాద్, జూలై 06 : పార్టీ కోసం ఫామ్ హౌస్కు వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని బాగ్ అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన తిరుమలరెడ్డి భువన మోహన్(50) అతని కజిన్ సోదరుడు నరేష్ కుమార్, స్నేహితులతో కలిసి శనివారం పామ్ హౌస్లో నిర్వహించిన పార్టీకి వచ్చారు.ఆదివారం ఉదయం గుండెపోటుకు గురి కావడంతో స్థానిక భాస్కర్ దవాఖానకు తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.