కులకచర్ల, డిసెంబర్ 30 : ప్రజలకు సంక్షేమ ఫథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో సర్పంచ్ శిరీషాలక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గ్రామాల్లో దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు బీఎస్ ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఎంపీటీసీ జ్యోతీశ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డి, అంజిలయ్యగౌడ్, పెంటమీది వెంకటయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.