కొనుగోలు కేంద్రాలు లేక.. మద్దతు ధర రాక అన్నదాత దళారుల చేతుల్లో దగా పడుతున్నాడు. రం గారెడ్డి జిల్లాలో 50%, వికారాబాద్ జిల్లాలో 80% వరకు వరి కోతలు పూర్తైనా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.. ధాన్యాన్ని నిల్వ ఉంచుకోలేక తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తూ నష్టాపోతున్నాడు. అకాల వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానల భయంతో రైతులు పంట పచ్చిగా ఉన్నా కోస్తున్నారు. ధాన్యాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబోద్దామంటే ఎప్పుడు వాన వస్తుందోనన్న భయం అన్నదాతల్లో నెలకొన్నది.
-రంగారెడ్డి/వికారాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతు కు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభు త్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ హయాం లో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు సేకరించగా.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది.
గత కేసీఆర్ ప్రభుత్వం వరి కోతకు వచ్చి న సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రేవంత్ సర్కార్ మాత్రం వరి కోతలు ప్రారంభమైనా ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడడంతోపాటు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధాన్యాన్ని కల్లా లు, రోడ్లపై ఆరబెట్టి ప్రభుత్వం ఎప్పుడు కొం టుందా..? అని నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు గత మూడు, నాలుగు రోజులుగా జిల్లాలో ఈదురుగాలుల తో కూడిన వర్షాలు కురుస్తుండడంతో కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన వడ్లు తడిచిపోతున్నాయి. అటు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు అన్యాయమవుతున్నారు.
ఇంకా ప్రారంభం కాని కొనుగోళ్లు..
వికారాబాద్ జిల్లాలో యాసంగికి సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాలో వరి కోతలు 80 శాతానికి పైగా పూర్తైనా.. ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఇంకా కేంద్రాలను ప్రారంభించనే లేదు. యా సంగిలో 92,000 ఎకరాల్లో వరి పంట సాగు కాగా, 2,25,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు అం చనా వేశారు. అదేవిధంగా ఈ యాసంగిలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా లో 128 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సోమవారం బొంరాస్‌పేట మండలంలో ఆరు, దోమ మం డలంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. ఆ కేంద్రాలను ప్రారంభించారే తప్ప రైతుల నుంచి ఒక గింజనూ కొనకపోవడం గమనార్హం. ఈ నెల మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు సమావేశాలు నిర్వహించినా.. కొనుగోళ్లలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అకాల వర్షాల భయంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు.
గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కనీసం పెట్టిన పెట్టుబడైనా వస్తుం దో..? రాదోననే ఆందోళనలో రైతులు ఉన్నా రు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని అన్నదాతలు కోరుతున్నారు. కాగా, జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించగా.. వాటిలో ఐకేపీ ద్వారా 41 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 49, డీసీఎంఎస్ ద్వారా 38 ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సన్నరకం వడ్లను సేకరించేందుకు 11 కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. మద్దతు ధర ఏ గ్రేడ్ క్విం టాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300లుగా చెల్లించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 95,000 ఎకరాల్లో పంటసాగు
రంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 95,000 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేయగా.. సుమారు 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే 50% వరకు కోతలు పూర్తైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా షాద్‌నగర్ నియోజకవర్గంలో 3, ఆమనగల్లులో 1, ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో గిట్టుబాటు ధర వస్తుందనుకున్న అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. ఈ యాసంగిలో ఓ వైపు అనావృష్టి.. మరోవైపు అతివృష్టి రైతులను నిండా ముంచింది. తీసుకొచ్చిన అప్పులు కూడా తీరని పరిస్థితి నెలకొన్నది.
దళారుల ధర రూ.2 వేల లోపే..
గ్రామాల్లో దళారులు రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.2,000 ధర మాత్రమే చెల్లించి ధాన్యాన్ని కొంటున్నారు. ఏకంగా రైతుల కల్లాల వద్దకే వెళ్లి సేకరిస్తున్నారు. ధాన్యం పచ్చిగా ఉందని, తాలు ఎక్కువగా ఉందని సాకుగా చూపించి క్వింటాకు రూ. 2,000 కంటే ఒక్క రూపాయీ ఎక్కువ చెల్లించడంలేదు. కాగా, ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధం రూ.2,320 నిర్ణయించింది. వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొంటూ రైస్‌మిల్లుల యజమానులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో జోరుగా వరి కోతలు సాగుతున్నాయి. ఇక్కడ 50% పైగానే కోతలు పూ ర్తైనా.. కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ప్రారంభమే కాలేదు.
తూకాల్లో మోసాలు..
మధ్య దళారులు రైతుల వద్ద ధాన్యం కొనేందుకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. ఈ మిషన్ల ద్వారా సరిగ్గా తూకం రావడంలేదని రైతులు పేర్కొంటున్నా రు. క్వింటాల్‌కు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తగ్గడంతోపాటు తాలు పేరుతో మరింత తరుగు తీస్తున్నారని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మద్దతు ధర రాక తూకాల్లో జరుగుతున్న మోసాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టాలకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
త్వరలో 26 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలోని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు త్వరలోనే 26 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే షాద్‌నగర్, ఆమనగల్లు ప్రాంతాల్లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశాం. మిగిలిన ప్రాంతాల్లోనే త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఐకేపీ, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలనూ ప్రారంభిస్తున్నాం. ధాన్యం గ్రేడ్-1 క్వింటాల్‌కు రూ.2,320, గ్రేడ్-2,300లకు క్వింటాల్ చొప్పున మద్దతు ధర చెల్లించి కొంటాం.
-గోపీకృష్ణ, సివిల్ సప్లయ్ డీఎం, రంగారెడ్డి
కల్లాలు, రోడ్లపైనే ధాన్యం..
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో గత వారం రోజులుగా ధాన్యం కల్లాల్లు, రోడ్ల పక్కన ఉన్నది. గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఉన్నది. ఎప్పుడు వాన వస్తుందోనన్న భయంతో ఉం డాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం వరి కోతలకు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాం గ్రెస్ సర్కార్ మాత్రం ధాన్యం ఇండ్లకు చేరి 15-20 రోజులు దాటినా ఇంకా కేంద్రాలను ఏర్పా టే చేయలేదు. రైతన్నపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. వెంటనే కొనగోలు కేంద్రాలను ప్రారంభించాలి.
-రాజశేఖర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ, కులకచర్ల
ధాన్యం తడుస్తుందనే భయంగా ఉన్నది..
ధాన్యం చేతికొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించకపోవడం దారుణం. రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలతో తడుస్తుందనే భయం వెంటా డుతున్నది. అధికారులు స్పందించి త్వర గా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనాలి. -బోయిని మొగులయ్య, రైతు అంతారం, కులకచర్ల