52 మంది అభ్యర్ధుల డిపాజిట్ గలంతు
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 52 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. గెలిచిన అభ్యర్థితోపాటు సమీప ప్రత్యర్థి మినహా మిగతా ఎవరికీ డిపాజిట్ దక్కలేదు.
- మూడు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకూ చుక్కెదురు..
- పరిగి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి మాత్రమే డిపాజిట్..
- గత ఎన్నికలతో పోలిస్తే 4 సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్‌కు పెరిగిన ఓటింగ్ శాతం
- వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్
- అత్యధికంగా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి 55.04 శాతం ఓట్లు
- వికారాబాద్ ఎమ్మెల్యేకు 48.67 శాతం, పరిగి ఎమ్మెల్యేకు 48.38 శాతం, తాండూరు ఎమ్మెల్యేకు 48.36 శాతం ఓట్లు
వికారాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 52 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. గెలిచిన అభ్యర్థితోపాటు సమీప ప్రత్యర్థి మినహా మిగతా ఎవరికీ డిపాజిట్ దక్కలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలుపొందినవారు, సమీప ప్రత్యర్థులు కాకుండా పరిగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బూనేటి కిరణ్ మాత్రమే డిపాజిట్ సాధించారు. మిగతా వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులకూ డిపాజిట్ దక్కకపోవడం గమనార్హం.
కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అస్సాం సీఎం, జార్ఘండ్ మాజీ సీఎం అర్జున్ ముండా వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. వికారాబాద్ నియోజకవర్గంలో 10 మంది, పరిగి 12 మందికి, తాండూరు 19 మంది, కొడంగల్ 11 మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. కొందరు అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో అత్యధిక ఓట్ల శాతం కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి వచ్చింది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి 55.04 శాతం ఓట్లు, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.ప్రసాద్‌కుమార్‌కు 48.67 శాతం ఓట్లు, పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డికి 48.38 శాతం ఓట్లు, తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డికి 48.36 శాతం ఓట్లు, వచ్చాయి.
అదేవిధంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే వికారాబాద్, తాండూరు నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో 12 శాతం ఓట్లు పెరగగా, వికారాబాద్ నియోజకవర్గంలో 11 శాతం, పరిగి నియోజకవర్గంలో 10 శాతం, తాండూరు నియోజకవర్గంలో 4 శాతం మేర ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వికారాబాద్ నియోజకవర్గంలో 4 శాతం మేర ఓట్లు, తాండూరు నియోజకవర్గంలో 1 శాతం ఓట్లు పెరగగా, పరిగి నియోజకవర్గంలో 10 శాతం, కొడంగల్ నియోజకవర్గంలో 10 శాతం మేర ఓట్లు తగ్గాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

