రంగారెడ్డి, మే 17 (నమస్తే తెలంగాణ) : వానకాల సీజన్‌కు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైనది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈసారి 4,45, 428 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. వరి, జొన్న, కంది, పెసర, మినుము, కంది, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం తదితర పంటల కోసం 44,594 క్వింటాళ్ల విత్తనాలు, 1,01,982 టన్నుల ఎరువులు, 4,91,036 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం అవుతాయని అధికారులు భావిస్తున్నా రు. ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసి వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవు తున్న తరుణంలో వారికి ఎక్కడా ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పత్తి ధర ఎక్కువగా ఉండడంతో ఎక్కువమంది పత్తి వేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో 1,76,174 ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.
4,45,428 ఎకరాల్లో సాగు..
వానకాలంలో 4,45,428 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సా గు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా పత్తి 1,76,174 ఎకరాల్లో, వరి 1,38,187 ఎకరాల్లో, మొక్కజొన్న 66,530 ఎకరాల్లో, ఉద్యాన పంటలతోసహా ఇతర పంటలను 48,959 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా..
పంటల సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికా రులు ప్రణాళికను సిద్ధం చేశారు. సాగు అంచనాకు అనుగుణంగా 44,594 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 4,91,036 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు నివేదికను పం పించారు. 1,01,982 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల విత్తనాలు, ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచగా..రానున్న రోజుల్లో ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు..;–గీతారెడ్డి, రంగాడ్డి జిల్లా వ్యవసాయ అధికారిణి
వానకాలంలో సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నాం. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. పత్తి బీటీ-1 విత్తన(450 గ్రా.) ప్యాకెట్‌కు రూ.635, బీటీ-2 విత్తన ప్యాకెట్‌కు రూ.864 చొప్పున ధరను నిర్దేశించడం జరిగింది. రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలోని ఏఆర్ఎస్కే, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లలో 30 కౌంటర్ల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పట్టాదా రు పాసు పుస్తకం, ఆధార్ కార్డును వెంట తప్పనిసరిగా తీసుకురావాలి.