కోతలు షురూ.. కరెంట్ కోతలతో రైతులకు మొదలైన కష్టాలు
కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక పవర్ కట్స్ కొనసాగుతున్నాయి. సమ య పాలన లేకుండా కోతలు విధిస్తుండడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- పెరుగుతున్న ఎండల తీవ్రత.. కొనసాగుతున్న అనధికార కోతలు
- రోజుకు 4 గంటల పాటు వ్యవసాయానికి పవర్ కట్
- పరిశ్రమలు, గృహ వినియోగానికి కూడా..
- బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా
- ప్రస్తుతం రోజుకు 7.5 మిలియన్ యూనిట్ల వినియోగం
వికారాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక పవర్ కట్స్ కొనసాగుతున్నాయి. సమ య పాలన లేకుండా కోతలు విధిస్తుండడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిమాండ్కు సరిపడా
లేకపోవడంతో త్రీఫేజ్ సరఫరా వేళల్లోనూ కోత లు విధిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. విద్యుత్తు సరఫరాలోనూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది.
గత కేసీఆ ర్ ప్రభుత్వంలో వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వ్యవసాయానికి కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం అధికారికంగా నాలుగు గంటలపా టు త్రీఫేజ్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు నిలిపేస్తున్నారు. ఓ వైపు బోర్లు, బావుల్లో అడుగంటిపోతున్న భూగర్భజలాల కు తోడు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు ఉన్న నీటిని కూడా అందించలేకపోతున్నారు. కరెంట్ కోతలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను జిల్లా రైతాంగం గుర్తు చేసుకుంటున్నది. గత ప్రభుత్వంలో నిరంతర విద్యుత్తు సరఫరాతో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు క్యూ కడితే… రేవంత్ హయాంలో విద్యుత్తు కోతలతో పరిశ్రమలు పవర్ హాలీడేలు ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహ వినియోగానికి సంబంధించి పట్టణాలతోపాటు గ్రామాల్లో రోజుకు 5-10 సార్లు పవర్ కట్స్ జరుగుతున్నాయి. గ్రామాల్లో గంటల తరబడి సరఫరా ను నిలిపేస్తున్నారు. మరోవైపు జిల్లాలో వ్యవసాయంతోపాటు గృహ వినియోగం, పరిశ్రమలకు రోజుకు ప్రస్తుతం 7.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, జిల్లాలో సుమారు 80 వేల వ్యవసాయ కనెక్షన్లున్నాయి.
రూ.303 కోట్లు ఖర్చు చేసి ఉచిత నిరంతర విద్యుత్తు..
గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం చీకటి అవుతుందని అక్కసు వెలగక్కిన సమైక్య పాలకుల వ్యాఖ్యలకు దీటుగా వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి పదేండ్లపాటు నిరంతర విద్యుత్తును అందించింది. రైతులకు ఇచ్చిన
మాట మేరకు కేసీఆర్ వ్యవసాయానికి పగలు 6 గం టలు, రాత్రి 3 గంటలపాటు సరఫరా చేసి, తదనంతరం రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురై మరణించడం తదితర ఇబ్బందికర ఘటనల తో పగటిపూటనే తొమ్మిది గంటలపాటు సరఫరా చేశారు. 2016 ఏప్రిల్ 1
నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును అందించిన గత ప్రభుత్వం.. 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేసింది. ఇందుకోసం రూ.303 కోట్లు ఖర్చు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా
పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 3.31 లక్షల ఎకరాల్లో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాకు ముందు జిల్లాలో 3.30 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం 2024 వరకు 6 లక్షల ఎకరాలకు పెరిగింది.
పంటలు ఎండిపోతున్నాయ్..
విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. కనీసం ఎకర పొలం కూడా పారడంలేదు. ప్రతిరోజూ కరెంట్ వస్తూ.. పోతున్నది. గత కేసీఆర్ హయాంలో విద్యుత్ సరఫరా మంచిగా ఉండే.
– బోయిని మొగులయ్య రైతు, అంతారం, కులకచర్ల
రోజూ నాలుగు గంటల పాటు కోతే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు విద్యుత్తును సక్రమంగా సరఫరా చేశారు. ప్రస్తుతం ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ లా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనన్న భయం నెలకొన్నది.
– అనంతయ్య, రైతు ముజాహిద్పూర్, కులకచర్ల
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

