శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Nov 22, 2020 , 04:14:50

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ధరణి పోర్టల్‌తో కర్షకుల కష్టాలు తీరుతున్నాయి. మండల కేంద్రాల్లోనే భూముల రిజిస్ట్రేషన్‌ చేస్తుండడంతో వ్యయప్రయాసలు తప్పాయి. పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన అనంతరం ఇంటికే పట్టాదారు పాస్‌బుక్‌ పంపిస్తున్నారు. అంతేకాకుండా తాసిల్దార్‌ కార్యాలయాల్లో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.  శనివారం రంగారెడ్డి జిల్లాలో 100, వికారాబాద్‌లో 40 రిజిస్ట్రేషన్లు అయ్యాయి.  

ఇబ్రహీంపట్నంరూరల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు, క్రయవిక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు ధరణి సేవలు జోరందుకుంటుండడంతో ధరణి సేవలకు మరింత ఆదరణ పెరుగుతున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో తాసిల్దార్‌ కార్యాలయాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి ధరణి ద్వారా రిజి్రస్ట్రేషన్లు కొనసాగుతున్నా యి. తాసిల్దార్‌ కార్యాలయాలు రైతులు, క్రయ విక్రయదారులతో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా శనివారం 100 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అందులో ఇబ్రహీంపట్నం 24, ఆమనగల్లు 21, చేవెళ్ల 27, షాద్‌నగర్‌ 28 రిజిస్ట్రేషన్లు ఐనట్లు తెలిపారు. 

వికారాబాద్‌ జిల్లాలో 40 రిజిస్ట్రేషన్లు 

తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణిలో భాగంగా శనివారం వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 40 వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి. బషీరాబాద్‌లో 1, బొంరాస్‌పేట్‌ 3, ధారూర్‌ 2, దౌల్తాబాద్‌ 1, కొడంగల్‌ 10, కుల్కచర్ల 1, మర్పల్లి 2, మోమిన్‌పేట్‌ 3, నవాబ్‌పేట్‌ 7, పరిగి 1, పెద్దేముల్‌ 2, పూడూర్‌ 3, తాండూరు 3, వికారాబాద్‌లో ఒకటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. 

రిజిస్ట్రేషన్‌ సమయంలో అందరూ ఉండాలి

కొందుర్గు: స్లాట్‌ బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న రైతులు తమతో ఉన్న సాక్షులను తప్పని సరిగా తీసుకురావాలని కొందుర్గు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటెషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుందని అన్నారు. రైతులు ఒక్క రోజు ముందు ఆన్‌లైన్‌లో స్లాటు బుక్‌ చేసుకుని వాటికి సంబంధించిన పత్రాలను, సాక్షులను తీసుకురావాలని తెలిపారు. మండలంలో శనివారం రెండు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలో నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రాములు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చేటప్పుడు పూర్తి వివరాలతో రావాలని అన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పత్రాలు సరిగ్గా లేకపోతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆలస్యం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ శివ, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మయ్య  ఉన్నారు.

ప్రతిఒక్కరికీ అందుబాటులో.. 

కడ్తాల్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం 7 రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆయన తెలిపారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు సులభతరం అయ్యాయని స్లాట్‌ బుక్‌ చేసుకుని తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చాక కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియంతా పూర్తి చేసి పత్రాలను చేతికి అందజేస్తున్నట్లు తాసిల్దార్‌ వివరించారు. నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది.. 

ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. వయస్సు పైబడటం వల్ల తిరగలేక పోయేవాడిని. ఇప్పుడు ఒక్కదగ్గరే పని పూర్తవుతుంది. పదుల సార్లు ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. వచ్చిన అర గంటలోపే పని అవుతుంది. దీంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవడంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. - అడివప్ప, రైతు, రుద్రారం. కొడంగల్‌ మండలం

ముమ్మాటికి ఇది రైతు ప్రభుత్వం 

గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతాంగ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు. పేదింటి రైతు కుటుంబంలో పుట్టిన   కేసీఆర్‌ మన ముఖ్యమంత్రి అవడం రాష్ట్ర ప్రజల అదృష్టం. ముమ్మాటికి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమే. రైతుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంతలా పథకాలు ప్రవేశపెట్టి, రైతుల బాధలు తొలిగించిన మహోన్నతమైన నాయకుడు కేసీఆర్‌. రాష్ట్రంలోని యావత్తు రైతాంగమంతా ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుంది.  - గణేశ్‌గౌడ్‌, ఇబ్రహీంపట్నం

సీఎంకు రైతులు రుణపడి ఉంటారు 

రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్‌ మనకు ముఖ్యమంత్రి కావడం ఎంతో అదృష్టం. ఎవరూ ఊహించని విధంగా నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్‌ పూర్తయి, పట్టాదారు పాసు పుస్తకాలు, మ్యుటేషన్‌ కాపీలు తొందరగా అందుతుండడం సంతోషకరం. రైతాంగం  పట్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలాంటి చిత్త శుద్ధి ఉందో దీంతో అర్థమవుతుంది. ఆయనకు రైతులంతా రుణపడి ఉంటారు.  - చిలుకల బుగ్గరాములు, రైతు, ఇబ్రహీంపట్నం

కొద్ది సమయంలోనే.. 

ధరణి పోర్టల్‌తో భూ రిజిస్ట్రేషన్‌ కొద్ది సమయంలో పూర్తవుతుంది. గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సం దేహం ఉన్నా అధికారులు వెంటనే నివృత్తి చేస్తు న్నారు. భూ రిజిస్ట్రేషన్లకు గతంలో ఎం తో ఇబ్బంది ఉండేది. తెలంగాణ సర్కార్‌ ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ధరిణి పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు.  -శ్రీనివాస్‌, కిషన్‌నగర్‌, ఫరూఖ్‌నగర్‌ మండలం

పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి 

ధరణి పోర్టల్‌ను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు పదినిమిషాల్లో పట్టా పాసుపుస్తకాలను అందజేస్తు న్నాం. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. మండలంలో ఇప్పటి వరకు 87 రిజిస్ట్రేషన్లు పూర్తిచేశాం. మరో మూడు పెండింగ్‌లో ఉన్నాయి. సులభంగా,  వేగంగా  రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగుతున్నది. దీంతో రైతులకు ఇబ్బందులు తొలిగా యి. మధ్యవర్తులు, పైరవీకారుల బెడద తప్పిందన్నారు.   - నాగయ్య, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, యాచారం 

 చాలా బాగుంది..

ధరణి పోర్టల్‌ సేవలు చాలా బాగున్నాయి. గతంలో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం బ్యాంకుతో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌, తాసిల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నేడు తాసిల్దార్‌ కార్యాలయాల్లోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి విధానం వస్తుందని మేము అనుకోలేదు. చాలా వేగంగా రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. ఇది తెచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఙతలు. - ఖాజా మున్న, రుద్రారం, కొడంగల్‌ మండలం

అరగంటలో పూర్తి

మోమిన్‌పేట్‌ మండలంలో భూమి కొనుగోలు చేసి తాసిల్దార్‌ కార్యాలయంలో అరగంటలో భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నా. తాసిల్దార్‌ మ్యుటేషన్‌ కూడా వెంటనే అందజేశారు. గతం లో భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. మ్యుటేషన్‌ గురించి కాళ్లరిగేలా వీఆర్‌వోల చుట్టూ ప్రదక్షిణలు చేసేది. ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్‌ బుక్‌ చేసుకుంటే అరగంటలో రిజిస్ట్రేషన్‌ పూర్తికావడం సంతోషం. - ఇంద్రాసేనరెడ్డి.చందిప్ప, మోమిన్‌పేట

రైతులకు ఎంతో మేలు.. 

ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు కావడంతో రైతులకు మేలు చేకూరుతున్నది. రిజిస్ట్రేషన్లపై రైతులకు అవగాహన లేకపోవడంతో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే తంటాలు పడాల్సి వచ్చేది. కాని ఇప్పుడు మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో తిరగాల్సిన పనిలేకుండా బాగుంది. భూమికి సంబంధించిన కాగితాలు, సాక్షులతో వెళ్లితే అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతున్నందుకు సంతోషంగా ఉంది.  - ఉమాశంకర్‌, తీగాపూర్‌, కొత్తూరు మండలం

ధరణి గొప్పమార్పు 

ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని పట్టా పాస్‌ పుస్తకాలు కావాలంటే చెప్పులు అరిగేలా తిరిగే వాళ్లం. కాని ఇప్పుడు స్లాట్‌ బుక్‌ చేసుకుని సాక్షులతో ఆఫీసుకు వస్తే అరగంటలో పట్టాకాగితాలు చేతికి వస్తున్నాయి. రైతు జీవితాల్లో ధరణి గొప్ప మార్పు. రైతు కష్టాలు తెలిసిన సీఏం కేసీఆర్‌ ఉండడంతో రైతులకు ఎన్నో విధాల మేలు జరుగుతున్నది. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. - వీరప్ప, తాండూరు మండలం

ఎంతో సులభం ..

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభంగా మారాయి. ఈ ప్రక్రియలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేదు. తాసిల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పారదర్శకంగా జరుగున్నా యి. అరగంటలోనే పని పూర్తి అయింది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, మ్యుటేషన్‌, పట్టాదారు పాస్‌బుక్‌ అన్ని ఒకే రోజు  గంటలోనే ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు ముందు సబ్‌ రిజిష్ర్టార్‌ ఆఫీస్‌, తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది.  - బాబులాల్‌, కొత్తూరు, కొత్తూరు మండలం

 దొంగ రిజిష్ర్టేషన్లకు చెక్‌ 

ధరణి పోర్టల్‌తో భూములున్న ప్రతిఒక్కరూ నిశ్చింతగా ఉండొచ్చు. ఒకప్పుడు భూమి యజమానికి తెలియకుండానే పట్టా చేసేవారు. కాని నేడు ధరణి వల్ల దొంగ రిజిస్ర్టేషన్‌ చేయడానికి వీలు లేదు. ఒక వేళ ఏదైనా జరిగితే వెంబడే రైతు కు పోన్‌ ద్వారా మెసేజ్‌ వస్తుంది. నేను భూమిని అమ్మి రిజిస్ర్టేషన్‌ చేయగానే నాకు మేసేజ్‌ వచ్చిం ది. నా భూమిలో అమ్మిన భాగం తొలగించి నాకున్న భూమికి వెంబడే పాసు బుక్కులో ఎక్కించారు. వెంబడే మ్యుటేషన్‌ ఇచ్చారు.   - యాదమ్మ, రైతు, ఇర్విన్‌, మాడ్గుల మండలం

తొందరగా ఆఫీసులో పని అయిపోయింది

నా భూమి పక్కన ఉన్న మరొకరి భూమిని కొన్నా. రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో తొందరగా పని చేసి తన పేరున  భూమిని ఎక్కించినారని. మండలంలోని బండలేమూరు గ్రామంలో ఉన్న చుట్టాల భూమి అయిన ఆరుగుంటల నర భూమిని కొన్నానని భూమి రిజిస్ట్రేషన్‌ కోసం మంచాలలో ఉన్న  మీసేవ జిరాక్స్‌  సెంటర్‌లో పేరు నమోదు చేసుకున్నా. మరుసటి రోజు అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసి పుస్తకాలను ఇచ్చారు. ఇంత తొందరగా పని అయినందుకు ఆనందంగా ఉంది.   - కొర్ర లక్ష్మి , రైతు, మంచాల