మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 02, 2020 , 03:26:28

మద్దతు ధర పొందాలి...

మద్దతు ధర పొందాలి...

  • దళారులను ఆశ్రయించవద్దు  
  • ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
  • విద్యాశాఖమంత్రి సబితారెడ్డి 
  • కందుకూరులో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం 
  • హాజరైన ఎంపీ రంజిత్‌రెడ్డి , జడ్పీ చైర్‌పర్స న్‌ అనితారెడ్డి 

 కందుకూరు: రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎసీఎస్‌ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మొక్కల కొనుగోలు కేంద్రాన్ని చేవేళ్ల ఎం పీ రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్మపర్సన్‌ తీగల అనితారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రా ష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ధాన్యానికి మంచి ధర ఇస్తుంటే మెడమీద కత్తి పెడుతున్నారని, ఈ రకమైన చిక్కుల్లో ఉన్నామని, రైతుల బాధలు, కష్టాలు, ఆత్మహత్యలను చూసి సీఎం కేసీఆర్‌ రైతులకు మధ్య దళారుల బెడద లేకుండా మంచి ధర ఇస్తున్నారని చెప్పారు. తమ రాష్ట్ర రైతులకు ఇస్తున్న మద్ధతు ధరను చూసి ఇతర రాష్ట్రల సీఎంలు సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముం దుకు సాగుతున్నారని, ఈ దళలో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సూచించినట్లు నియంత్రిత సాగుకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. తద్వారా అన్ని పంటలకు మంచి ధర లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న రైతులకు మధ్దతు ధర ఇవ్వాలని ఉద్దేశంతో మొక్కలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మక్కజోన్న సాగు చేసిన రైతులు పంటలను ప్ర భుత్వం ప్రకటించిన మధ్దతు ధరకు విక్రయించాలని చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి కోరారు. ప్రభుత్వం ఏ ర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. పీఎసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ బొ క్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు,మార్కెట్‌ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి,గ్రంథాలయ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్‌ ముదిరాజ్‌, డైరెక్టర్లు, శేఖర్‌రెడ్డి, అంజమ్మ, పాండురంగారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, పొట్టి ఆ నంద్‌, వెంకట్‌రాంరెడ్డి, సీఈవో రాములు, యాదగిరిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.