శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 26, 2020 , 00:01:21

111 సమస్యను ప‌రిష్క‌రిస్తాం

111 సమస్యను  ప‌రిష్క‌రిస్తాం

  • స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల కోరిక మేరకు సీఎం నిర్ణయం
  • పర్యావరణాన్ని కాపాడేలా..  న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటాం
  • రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో  మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి
  • రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చందనవెల్లిలో టెక్స్‌టైల్స్‌ పార్కు  ప్రారంభం
  • చేవెళ్ల, మొయినాబాద్‌,  హైతాబాద్‌లలో పార్టీ  జెండావిష్కరణలు
  • భారీగా హాజరైన టీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • గులాబీమయమైన రహదారులు

ఎన్నికల సమయంలో 111జీవోపై ఇచ్చిన హామీ మేరకు పర్యావరణానికి నష్టం లేకుండా, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల కోరిక ప్రకారం సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లిలో టెక్స్‌టైల్స్‌ పార్కును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నగరం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన మంత్రి కేటీఆర్‌కు చేవెళ్ల, మొయినాబాద్‌, హైతాబాద్‌లో స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ మూడు చోట్లా ఆయన టీఆర్‌ఎస్‌ జెండావిష్కరణలు చేశారు. హైతాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇక్కడికి కచ్చితంగా 50నుంచి 60 వరకు కొత్త పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. షాబాద్‌తో పాటు చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశముందని అన్నారు. స్థానికులకే శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, దీంతో ఈ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మారిపోతాయని అన్నారు.  కార్యక్రమాల్లో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.

- రంగారెడ్డి, నమస్తే తెలంగాణ / షాబాద్‌


రంగారెడ్డి,నమస్తే తెలంగాణ/షాబాద్‌/ మొయినాబాద్‌/చేవెళ్ల:  స్థానికులు ఎన్నో ఏండ్ల్లుగా ఎదుర్కొంటున్న 111జీవో సమస్యను పరిష్కరించేందుకు  సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటారని, ప్రజలు నమ్మకంతో ఉండాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం షాబాద్‌ మండలంలో  చందనవెల్లి టెక్స్‌టైల్స్‌ పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి, వాణిజ్య. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌,  కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, పరిశ్రమల శాఖ ఎండీ నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, విద్యా, మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మన్‌ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్‌ మొయినాబాద్‌, చేవెళ్ల చౌరస్తాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం హైతాబాద్‌ చౌరస్తాలో కేటీఆర్‌  ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల సమయంలో 111జీవోపై ఇచ్చిన హామీ మేరకు ఆ జీవోను సడలించేందుకు ఈ ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా పర్యావరణానికి నష్టం చేయకుండా,  కోర్టు ద్వారా న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా సీఎం కేసీఆర్‌ తప్పకుండా సమస్య పరిష్కరిస్తారని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచండని చెప్పారు.  అన్ని పార్టీలు జీవోను ఎత్తివేయాలని కోరుతున్నట్లు తెలిపారు.  స్థానిక యువతకు ఉద్యోగ ఆవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్‌ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడికి కచ్చితంగా 50 నుంచి 60 వరకు కొత్త పరిశ్రమలు తీసుకువచ్చేందుకు  కృషి చేస్తామన్నారు. ఇక్కడే శిక్షణ ఇప్పించి ఉద్యోగ ఆవకాశాలు కల్పిస్తామని చెప్పారు.  భూములిచ్చి, ఇక్కడ పరిశ్రమలు రావడానికి ఆహ్వానించి, సహకరించి అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తున్న రైతన్నల మేలు మరచిపోలేమన్నారు. భవిష్యత్తులో షాబాద్‌తో పాటు చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతుబంధు సమితి  జిల్లా  అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, షాబాద్‌ ఎంపీపీ కోట్ల ప్రశాంతి, మొయినాబాద్‌ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌ నెంటూరి రవీందర్‌రెడ్డి, పొన్న నర్సింహారెడ్డి, సర్పంచులు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మద్దూరి మల్లేశ్‌, రైతుబంధు సమితి మండల  అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ షాబాద్‌, చేవెళ్ల, మొయినాబాద్‌ మండలాల అధ్యక్షులు నర్సింగ్‌రావు, ప్రభాకర్‌, మహేందర్‌రెడ్డి, నాయకులు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చాంద్‌పాషా, రాజుగౌడ్‌, దర్శన్‌, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటయ్య, యాదిరెడ్డి తదితరులున్నారు. 

ఘనస్వాగతం

మంత్రి కేటీఆర్‌కు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్‌ఎస్‌ యువనేత కార్తీక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, చిలుకూరు సర్పంచ్‌ స్వరూప, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు  పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మొర శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షులు జయవంత్‌, బాలరాజు, ప్రధానకార్యదర్శి రవూఫ్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు డప్పు రాజు  పాల్గొన్నారు.

హైతాబాద్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి,  చేవెళ్ల మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, చేవెళ్ల నియోజకవర్గం యూత్‌ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, మండల మాజీ అధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి, రమేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల మండల సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌, మాణిక్యకెడ్డి, నరేందర్‌ గౌడ్‌, రామగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. ఔటర్‌రింగు రోడ్డు నుంచి హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే గులాబీమయమైంది. షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఏర్పాటు చేసిన కేటీఆర్‌ భారీ కటౌట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్ల్లెక్సీలు, బ్యానర్‌లతో హైవే పొడవునా గులాబీమయంగా కనిపించింది. 

కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా...

కొవిడ్‌-19నిబంధనలకు అనుగుణంగా పర్యటన ఆసాంతం పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు జెండాలు ఎగురవేసే ప్రాంగణం ఆవరణల్లో  హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు.  ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక వాహనంలో మైకుల ద్వారా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి పది నిమిషాలకోసారి మంత్రి పర్యటన ముగిసే వరకు శానిటైజేషన్‌  చేశారు.