బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 23, 2020 , 23:44:45

దసరా నాటికి రైతు వేదికలు

దసరా నాటికి రైతు వేదికలు

  • వ్యవసాయంలో సమూల మార్పుల కోసమే రైతు వేదికలు : ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 
  • శివారెడ్డిపల్లిలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ

దోమ: వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావడం కోసమే ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టిందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం దోమ మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామం లో సర్పంచ్‌ నరేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని, రైతును రాజుగా తీర్చిదిద్దే విధంగా రాబోయే దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్‌ ఎంపీపీ మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంతునాయక్‌, రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మయ్య ముదిరాజ్‌, ఎంపీటీసీలు నవాజ్‌రెడ్డి, జగ్గారెడ్డి, సర్పంచ్‌లు యాదయ్య సాగర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రాఘవేందర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, రైతు బంధు సభ్యుడు అర్జున్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ చెన్నయ్య, పంచాయితీరాజ్‌ ఏఈ మణికుమార్‌, మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, ఏఈవో దుర్గాప్రసన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.