వికారాబాద్, సెప్టెంబర్ 16 : 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన ప్రైవేట్ డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని.. పలువురు సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ..
డీఎడ్ 2007, 2009 ప్రైవేట్ డీఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చి.. తమకు మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు మెరిట్ జాబితాలో వచ్చాయని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా జరిగిందని వివరించారు. స్పం దించిన సీఎం.. ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంను కలవాలని సూచించారు.కార్యక్రమంలో కిశోర్, వెంకటేశ్, అనూష, పద్మ, సంధ్య, సునీత, మంజుల, గీతాంజలి, ప్రవీణ్, జైపాల్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.