అక్టోబర్ 4వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితా తరువాత జిల్లాలో కొత్తగా 1,67,163 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 35,23,219కి చేరింది. ఇందులో పురుషులు 18,22,366 మంది ఉండగా, మహిళలు 16,99,600 మంది ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,32,506 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా షాద్నగర్ నియోజకవర్గంలో 2,36,338 మంది ఉన్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ)
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది జాబితాను రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హోళీకేరీ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 35,23,219 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 4న విడుదల చేసిన తుది జాబితా తర్వాత 1,67,163 మంది ఓటర్లు పెరిగారు. తుది జాబితాలో ఉన్న వారందరికీ ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పిస్తున్నారు.