Kondakal | చేవెళ్ల రూరల్, మార్చి 19 : గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ యార్డులో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడంతో పంచాయతీ కార్యదర్శి వారికి రూ.1000 జరిమానా విధించాడు. వివరాళ్లోకి వెళితే.. శంకర్పల్లి మండల పరిధి కొండకల్ గ్రామ పంచాయతీకి సబంధించిన మార్కెట్ యార్డులో బుధవారం గ్రామానికి చెందిన ఇద్దరు మద్యం సేవిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారి, సిబ్బంది అక్కడకు చేరుకొని వారికి జరిమానా విధించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యాలయాలు, పరిసరాల్లో మద్యం సేవించినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని పంచాయతీ సెక్రటరీ రియాజుద్దీన్ హెచ్చరించారు.