హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 17 మంది కార్మికులు ఉన్నారని తెలిపారు. గాయపడినవారంతా బెంగాల్‌కు చెందినవారని, వరి నాట్ల కోసం నారాయణపేట్ జిల్లాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.