ప్రచార జోష్
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
- అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్న అభ్యర్థులు
- మరోసారి ఆశీర్వదిస్తే అండగా ఉంటామని ప్రజలకు భరోసా
- అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం షాద్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ ఫరూక్నగర్ మండలంలోని కొండన్నగూడ, వెంకన్నగూడ, బుచ్చుగూడ గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనాజీపూర్‌లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. నవాబుపేట మండలంలోని కొజ్జవనంపల్లి, కడ్చర్ల, మీనాపల్లి కలాన్, అర్కతల, యావపూర్ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ముమ్మరంగా ప్రచారం చేశారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ)
చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం..
చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్‌కు కానుకగా పంపిస్తా. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నాం. మా ప్రభుత్వం చేసిన పనులు చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. ప్రతిపక్ష పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు. ప్రజల ఆశీర్వాదంతో చేవెళ్లలో మళ్లీ విజయం ఖాయం.

– కాలె యాదయ్య, బీఆర్ఎస్ అభ్యరి,్థ చేవెళ్ల
షాబాద్, అక్టోబర్ 28 : ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళ్తున్నది. చేవెళ్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయం. ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నెల రోజుల ముందుగానే సిట్టింగ్‌లందరికీ టికెట్లు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ప్రచారంలో బిజిబిజీగా మారారు. 2014 ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలె యాదయ్య అ తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పదేండ్ల కాలంలో ఐదు మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలిచారు.
వారం రోజుల కింద నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరుసటి రోజు నుంచి రోజుకో మండలంలో ప్రచారం నిర్వహిస్తుండడంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. రెండు రోజుల కింద షాబాద్ మండలంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 2వేల బైకులతో ర్యాలీ, ప్రజా ఆశ్వీరాద సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం ఏర్పడింది.

గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన..
నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు సాయం పెంపు, ఆసరా పింఛన్లు పెంపు, ప్రతి ఇంటికీ బీమా సదుపాయం, ఆరోగ్యశ్రీ, అన్నపూర్ణ పథకం ద్వారా పేదలకు సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు తదితర అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

