ఇబ్రహీంపట్నం, జనవరి 8 : సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నాయని, వాటికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు చేరుతున్నారని అన్నారు.
కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేయాలన్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తు న ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజు, దేవరాం, సందీప్, మహేశ్, జగదీశ్, వినోద్, రాము, రమేశ్, కిషన్, రాము, కల్యాణ్, జంగయ్యతో పాటు సుమారు 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహదూర్, నాయకులు వెంకటేశ్, బద్రీనాథ్గుప్తా, నారి యా దయ్య, అనిల్కుమా ర్, గోపాల్, శ్రీశైలం, శంకర్, సుధాకర్, జంగయ్య పాల్గొన్నారు.