మంగళవారం 09 మార్చి 2021
Rajanna-siricilla - Jan 24, 2021 , 03:08:00

రాష్ట్రస్థాయిలో రాణించాలి

రాష్ట్రస్థాయిలో రాణించాలి

వేములవాడ, జనవరి 23: గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించేందుకు చేయూతనందించడానికి సిద్ధమని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తోట రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం లో రెండు రోజులుగా జరుగుతున్న గ్రామీణ స్థాయి జిల్లా కబడ్డీ పోటీలను శనివారం ఆయన సందర్శించారు. క్రీడాకారులోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుందని తెలిపారు. ఇక్కడ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ సంపత్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు బొడ్డు రాములు, జిల్లా జాయింట్‌ సెక్రటరీ సొమినేని బాలు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, రూరల్‌ ఎంపీపీ బండ మల్లే శం, ఎర్రం మహేశ్‌, పిట్టల వెంకటేశ్‌, గోపు బాలరాజు, ముప్పిడి శ్రీనివాస్‌, అమరేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, కౌన్సిలర్లు ముప్పిడి సునంద, రామతీర్థపు కృష్ణవేణి, పీఈటీలు రవీందర్‌రావు, దేవతాప్రభాకర్‌, శ్రీనివాస్‌, మమత, సురేశ్‌, బాబు, రాజశేఖర్‌ ఉన్నారు.  

VIDEOS

logo