బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 12, 2020 , 01:20:12

ప్రత్యేక పూజలు.. కోడె మొక్కులు

ప్రత్యేక పూజలు.. కోడె మొక్కులు

రాజన్న ఆలయంలో సాధారణ రద్దీ

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం

వేములవాడ కల్చరల్‌: ఏకాదశిని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాం గణంలో సాధారణ రద్దీ కనిపించింది. భక్తులు మాస్కులు ధరించి డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ ద్వారా లోనికి ప్రవేశించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు. సత్యనారాయణ వ్రతాలు చేశారు. చండీ హోమం నిర్వహించారు. అనం తరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు.