శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 26, 2020 , 02:24:44

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

కొత్తపల్లి: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌ కోరారు. మండలంలోని చింతకుంట గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు భూక్యా తిరుపతినాయక్‌, పట్టెం శారద, నాయకుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.