గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 16, 2020 , 00:57:13

మండలాభివృద్ధికి కృషి

మండలాభివృద్ధికి కృషి

n ఎంపీపీ గంగం స్వరూపారాణి n అధికారులతో సమీక్షా సమావేశం 

రుద్రంగి: మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీపీ గంగం స్వరూపారాణి పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, అన్నిశాఖల అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎంపీపీ మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. డంప్‌యార్డు, శ్మశానవాటిక, కంపోస్టు షెడ్‌ నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. వానకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయాధికారులు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్‌ వ్యాధులు, కరోనా వైరస్‌ ప్రబలకుండా వైద్యాధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పశువులు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందించాలని పశు వైద్యాధికారులను ఆదేశిం చారు. మండలానికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరయ్యాయని, వీటితోపాటు పలు ప్రభు త్వ కార్యాలయాలకు స్థలం కేటాయించాలని రెవె న్యూ అధికారులను కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పీసరి చిన్నభూమయ్య, తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీవో శంకర్‌, ఎంపీటీసీలు చెప్యాల రవళిక పాల్గొన్నారు.


logo