కూలర్ కొనే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..

ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నారు నిపుణులు.
- పర్సనల్ కూలర్స్ vs డిసర్ట్ కూలర్స్ : కూలర్లలో ఈ రెండు రకాలుంటాయి. రూమ్ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 200-300sft లో మీరుండే గది ఉంటే పర్సనల్ కూలర్ సరిపోతుంది. అంతకుమించి రూమ్ సైజు ఉంటే కనుక డిసర్ట్ కూలర్ తీసుకోవడం మంచిది.
- వాటర్ ట్యాంక్ కెపాసిటి : కూలర్ తీసుకునేముందు ఈ విషయం గురించి కూడా ఆలోచించండి. మీరుండే గది చిన్నదైతే 15-25లీటర్లు, కాస్త పెద్దదైతే 25-40లీటర్లు, ఇంకా పెద్దదైతే 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న కూలర్ ని తీసుకోవడం ఉత్తమం.
- వాతావరణం : పొడి వాతావరణంలో అయితే డిసర్ట్ కూలర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే తేమ వాతావరణంలో అంటే తీర ప్రాంతాల్లో నివసించే వాళ్లు పర్సనల్, టవర్ కూలర్లు తీసుకోవడం బెటర్.
- సౌండ్ : కూలర్ కొనేముందు నాయిస్ లెవెల్ అంటే కూలర్ ఆన్ చేసినప్పుడు ఎంత సౌండ్ వస్తుందన్నది చెక్ చేసుకోవాలి. షోరూమ్‌లో ఓసారి డెమో చూడటం మంచిది.
- ఆటో ఫిల్ ఆప్షన్ : కూలర్లలో ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది. నీళ్లు ఖాళీ కాగానే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల కూలర్ మోటార్ పాడుకాకుండా ఉంటుంది.
- కూలింగ్ ప్యాడ్స్ : ఎయిర్ కూలర్‌కు కూలింగ్ ప్యాడ్స్ కూడా ముఖ్యమే. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అని వివిధ రకాలుంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూలింగ్ నిస్తుంది. మెయింటనెన్స్ కూడా తక్కువ.
- ఐస్ ఛాంబర్ : కొన్ని కూలర్లలో ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే ట్యాంక్ త్వరగా కూల్ అవుతుంది.
- పవర్ యూసేజ్ : కూలర్ వేసినప్పుడు ఎన్ని పవర్ యూనిట్లు అవుతుందన్నది తెలుసుకోవడం ముఖ్యం. స్టార్ రేటింగ్స్ ని చూసి ఎంపిక చేసుకోండి. అలాగే ఈమధ్యన ఇన్వర్టర్ టెక్నాలజీతో కూలర్లు వస్తున్నాయి. వీటి వల్ల కూడా పవర్ సేవ్ అవుతుంది. కరెంట్ పోయినా కూలర్ కొద్ది సేపు పనిచేస్తుంది.
- ఇతర ఫీచర్లు : టెక్నాలజీ పెరుగుతోంది కాబట్టి కూలర్లలో ఇప్పుడు చాలా ఫీచర్లు వస్తున్నాయి. రిమోట్ కంట్రోల్, యాంటీ మస్కిటో ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ లాంటి అదనపు ఫీచర్లను ఇస్తున్నారు. ఒకసారి వాటిని కూడా ఎంక్వైరీ చేసుకొని మంచి కూలర్ ని తీసుకోండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

