e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home కరీంనగర్ ‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి

‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి

‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి

ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలి
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌
గోరంటాల, మల్లారెడ్డిపేట,లింగన్నపేట గ్రామాల్లో పర్యటన

గంభీరావుపేట, జూలై 13: పల్లె ప్రగతి స్పూర్తితో గ్రామా ల్లో పచ్చదనం, పరిశుభ్రత పనులను నిరంతరం కొనసాగిం చాలని అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. గోరం టాల, మల్లారెడ్డిపేట, లింగన్నపేట గ్రామాల్లో శానిటైజేషన్‌, పచ్చదనం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో నాటిన మొక్కలను చూశారు. మురుగు కాలువల పరిశుభ్రత, తడి పొడి చెత్త సేకరణ, వైకుంఠ ధామం, కంపోస్ట్‌ షెడ్‌లో సేంద్రియ ఎరువుల తయారీని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటికీ ఆరు మొక్కలు అందించి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలన్నారు. మొక్కలు నాటి సంర క్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యద ర్శులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టి కృషితో గ్రామాల్లో పచ్చదనం వెల్లివి రిసేలా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పల్లె ప్రగతి కార్యక్రమ రికార్డుల ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, డీపీవో రవీందర్‌, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, సర్పంచులు కొలుముల అంజమ్మ, శెట్టి మహే శ్వరి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ లింగన్నగారి దయాకర్‌రావు, ఏపీవో అరుణ, నేతలు వంగ సురేందర్‌రెడ్డి, శెట్టి రవి, కృష్ణమూర్తి గౌడ్‌, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి
‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి
‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి

ట్రెండింగ్‌

Advertisement