Praja Ashirvada Sabha : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)కు జనం పోటెత్తారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలనే పిలుపుతో నిర్వహించిన సభకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గులాబీ బాస్ ప్రసంగం వినేందుకు వ్యయప్రయాసాలు లెక్కచేయకుండా తండోపతండాలుగా తరలివచ్చారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ… సూటిగా, స్పష్టంగా తన మార్క్ పంచ్లతో కొనసాగిన కేసీఆర్ వాగ్ధాటిని ప్రత్యక్షంగా చూసి తరించిన అభిమానులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం నిండిపోయింది. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో మాదిరిగానే జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు జనం హాజరవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అశేషంగా వచ్చిన మద్దతుదారులు చూస్తుండగా.. తన సమక్షంలో కారెక్కిన జీవన్ రెడ్డికి వేదిక మీద నుంచే బీఆర్ఎస్ కార్యదర్శి బాధ్యతలు కట్టబెట్టారు కేసీఆర్.









