భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హాజరైన ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో దిగ్విజయంగా జరిగింది. ఈ సభను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు ప్రారంభ సూచకంగా ప్రకటించింది.
Praja Ashirvada Sabha : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)కు జనం పోటెత్తారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలనే పిలుపుతో నిర్వహించిన సభకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.