KCR : యావత్ తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దమైంది. కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ఘట్టానికి సభా ప్రాంగణం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(సోమవారం) సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో కేసీఆర్ జగిత్యాలకు బయలుదేరుతారు.
జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుండి నేరుగా కేసీఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో గులాబీ బాస్ కీలక భేటీ నిర్వహిస్తారు. పార్టీ కార్యాలయం నుంచి సాయంత్రం 6 గంటలకు భారీ ర్యాలీగా కేసీఆర్ సభా ప్రాంగణానికి వెళ్తారు. అనంతరం జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.
రేపు సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరనున్న కేసీఆర్
జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక భేటీ
సాయంత్రం 6… https://t.co/EsvJxhhEop pic.twitter.com/yNl5nEzodD
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2026
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ‘జగిత్యాల నుంచే బీఆర్ఎస్ పూర్వ వైభవానికి నాంది పడనుంది’ అని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సభా స్థలిని పరిశీలించిన కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.