శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 21, 2021 , 02:37:20

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ఓదెల, జనవరి 20: చిన్ననాటి మిత్రుడు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి స్నేహితులు బాసటగా నిలిచారు. కనగర్తికి చెందిన కన్నె శ్రీనివాస్‌ అనారోగ్యంతో పదిహేను రోజుల క్రితం మృతి చెందాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. చిన్ననాటి స్నేహితుడి కుటుం బం ఆపదలో ఉన్న విషయం తెలుసుకొని 1997-98 పదో తరగతి బ్యాచ్‌ మిత్రులు రూ.50వేలు ఆర్థిక సహాయాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి బాండ్‌ బుధవారం స్నేహితుడి కూతురు అభిసాత్విక్‌కు అందజేశారు. కార్యక్రమంలో ముత్యం శ్రీనివాస్‌, ప్రశాంత్‌, ప్రసాద్‌, ఆడెపు శ్రీనివాస్‌, శంకర్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo