బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jul 31, 2020 , 01:36:09

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

  • n  పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • n  కమాన్‌పూర్‌లో మహిళా సంఘం ఆధ్వర్యంలో నాటుకోళ్ల పెంపకం ప్రారంభం

కమాన్‌పూర్‌: మహిళలు స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నదని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మ న్‌ పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు. మండలకేంద్రంలోని బాపూజీనగర్‌లో గల కోళ్ల ఫారంలో ఆదివరాహ మండల సమాఖ్య ఆధ్వర్యంలో పెర టి కోళ్ల పెంపకాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళల ప్రగతి కోసం రూపొందించిన ప్రణాళికలను అమ లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలా ల్లో మహిళా సంఘాల సమైఖ్య ఆధ్వర్యంలో వివి ధ రకాల ఉపాధి కల్పిస్తామని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. పెరటి కోళ్లను 40 రోజులపాటు పెంచిన అనంతరం మహిళా సం ఘాల సభ్యులకు 10 నుంచి 20 వరకు పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, డీఆర్డీవో సునీత, ఎంపీడీవో వాజిద్‌, జడ్పీ చైర్మన్‌ ఓఎస్డీ సలీం, తహసీల్దార్‌ పాల్‌సింగ్‌, ఏపీఎం శైలజాశాంతి, పశువైద్యాధికారి మహేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు, మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఉప్పరి శ్రీనివాస్‌ యాదవ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చిందం తిరుపతి,  కో ఆప్షన్‌ సభ్యుడు ఇంతియాజ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, కోలేటి చంద్రశేఖర్‌, శెవ్వ శంకరయ్య, బొజ్జ రాజసాగర్‌, సాయికుమార్‌, నాయకులు పొనగంటి కనుకయ్య, లక్ష్మిమల్లు తదితరులు పాల్గొన్నారు.