బుధవారం 12 ఆగస్టు 2020
Peddapalli - Jul 03, 2020 , 02:57:22

రైతు సంక్షేమమే లక్ష్యం

రైతు సంక్షేమమే లక్ష్యం


  • n భరోసా కోసమే వేదికలు నిర్మిస్తున్నాం 
  • n రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ 
  • n ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ధర్మపురి/గొల్లపల్లి/పెగడపల్లి: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యమని, అన్నింటా అండగా నిలిచేందుకు వేదిక లు నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొప్పు ల ఈశ్వర్ ఉద్ఘాటించారు. గురువారం ధర్మపురి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వెల్గటూర్ మండలం గుల్లకోటలో రూ.22లక్షల అంచనా వ్యయంతో రైతు వేదిక, పెగడపల్లి నంచర్ల గ్రామంలో రూ.కోటి నిధులతో, గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో రూ.91లక్షల నిధులతో చేపట్టిన, చేపట్టబోయే  పలు అభివృద్ధి పనులకు జడ్పీ చైర్ పర్సన్ వసంత, కలెక్టర్ గగులోతు రవితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రైతులు, వ్యవసాయాధికారులకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో దశాబ్దాల పాటు పాలన కొనసాగించి ప్రతిపక్ష పార్టీలు చేసింది శూన్యమని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం ఇద్దామన్న ఆలోచనగాని, ప్రాజెక్టును నిర్మిద్దామన్న సోయిగాని లేదని మండిపడ్డారు. ఇప్పుడు గద్దెదిగాక ధాన్యం కొనుగోళ్లు, కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ప్రాజెక్టుల నిర్మాణంపై విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోనే తెలంగాణ అరవై ఏండ్ల ప్రగతిని సాధించిందని, సా గునీటి రంగంలో అపూర్వ విజయాలు నమోదు చేసుకుంటున్నదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రావడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఇక రాష్ట్రంలో ఎవుసాన్ని లాభసాటిగా మార్చేందుకే సీఎం కేసీఆర్ నియంత్రిత సేద్యానికి శ్రీకారం చుట్టారనీ, ఈ పద్ధతి ద్వారా రైతులకు ఎంతో మే లు జరుగుతుందని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని మం త్రి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా సీ ఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని, మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురిలో హరితహారం కింద మొక్కలు నా టారు. గొల్లపల్లిలో కాంగ్రెస్ నుంచి పలువురు ముదిరాజ్ సంఘ నాయకులు టీఆర్‌ఎస్ చేరగా, కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. అలాగే పెగడపల్లి కస్తూర్బా పాఠశాలలో గతేడాది హరితహారం కింద నాటిన టేకు మొక్కలు ఏపుగా ఎదగడంపై ఈజీఎస్ సిబ్బందిని మంత్రి, కలెక్టర్ అభినందించారు.

అభివృద్ధికి అంకురార్పణ.. ప్రకృతి వనం ప్రారంభోత్సవం.. 

పెగడపల్లి మండలం నంచర్ల గ్రామ సమీపంలో మంత్రి ఈశ్వర్ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అందులో ఐదు మొక్కలు నాటారు. గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకే ప్రభుత్వం ఊరికో పార్కును ఏ ర్పాటు చేస్తున్నదని చెప్పారు. గ్రామంలో రూ.26లక్షలతో పూర్తిచేసిన గౌడ, ముదిరాజ్ సంఘ భవనాలు, రామాలయంలో రథ భవనాలను ప్రారంభించడంతోపాటు రూ. 30లక్షల విలువ చేసే మూడు సీసీ రోడ్లు, మహిళా సంఘం పనులతోపాటు పెగడపల్లిలో రూ.10 లక్షల విలువైన సీసీ రోడ్డు, రూ.22లక్షలతో నిర్మించనున్న రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్-రాఘవపట్నం మధ్య ఎస్సారెస్పీ కెనాల్‌పై రూ.25 లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులకు, రాఘవపట్నం క్లస్టర్ పరిధిలో రూ.22 లక్షలతో రైతు వేదికకు శంకుస్థాపన, రాఘవపట్నంలో రూ.38 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, ముదిరాజ్ సంఘ భవనం ప్రహరీని  మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో.. ఆర్‌డీవో మాధురి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీనారాయణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, డీఏఓ సురేశ్‌కుమార్, జడ్పీటీసీలు గోస్కుల జలంధర్, సుధారాణి, రాజేందర్‌రావు, ఎంపీపీ కనుమల్ల లక్ష్మి, శోభ, వైస్ ఎంపీపీలు ముస్కు కవిత, ఆవుల సత్తయ్య,  గంగాధర్  ఉన్నారు.  logo