Brahmanandam | తనయుడితో కలిసి ‘బ్రహ్మ ఆనందం’
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘బ్రహ్మ ఆనందం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు.
Brahmanandam | హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘బ్రహ్మ ఆనందం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. బుధవారం ఈ సినిమా తాలూకు ప్రీలుక్ పోస్టర్‌తో పాటు అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగే సరదా సంభాషణ అందరిని ఆకట్టుకుంటున్నది.
ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజా గౌతమ్.. తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తామని, డిసెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి, ఆర్ట్: క్రాంతి ప్రియం, రచన-దర్శకత్వం: ఆర్వీఎస్ నిఖిల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

