కడుపులో విషం పెట్టుకొని ప్రేమను నటించే కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో దాగి ఉన్న అధికార దాహాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హయంలో నాటి నెహ్రూ నుంచి నేటి కాంగ్రెస్ దాకా తెలంగాణకు అంతా నష్టమే వాటిల్లింది. అధికార ద్యాస తప్పా… ఏనాడూ ప్రజల వ్యధలను అర్థం చేసుకోని పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమంలో వందలాది బిడ్డలు నేలరాలుతున్న సందర్భంలో ఒక్కరు రాజీనామా చేయకుండా ఆనాడే ముఖ్యమంత్రి పదవి కోసం.. మంత్రి పదవుల కోసం ఆరాటపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ ప్రయత్నాలను తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకువెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మనం మరింత బలోపేతం చేయాలి. ఈ సందర్భంగా రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ఏకంగా ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎత్తి బెదిరించిన సంఘటనలను చూశాం. అటువంటి ఆవేశపూరిత వ్యక్తుల నాయకత్వం తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ సమాజాన్ని బాగు చేయాలంటే, అభివృద్ధి పథంలో నడిపించాలంటే కావాల్సింది ముందుచూపు. ముఖ్యమంత్రి పదవి ఆరాటం తప్ప తెలంగాణ సంక్షేమం కోసం ఆలోచన లేని నాయకత్వం కాంగ్రెస్‌ది. దానికి నిదర్శనం ఆరున్నర దశాబ్దాల తెలంగాణ సంక్షోభమే. అటువంటి పార్టీని ప్రజలు వీలైనంత దూరంలో ఉంచాల్సిన అవసరం ఉన్నది.
గతంలో రేవంత్‌రెడ్డి తమ సామాజిక వర్గం చేతుల్లోనే అధికారం ఉండాలంటూ బడుగు, బలహీన వర్గాలను అవమానించేలా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజలకు తాము చేసే పనుల మీ ద స్పష్టత లేని కాంగ్రెస్ నాయకత్వం, రాజకీయ విమర్శలు చేయడం మాని, వ్యక్తిగత విమర్శలతో తన మందబుద్ధ్దిని చాటుకుంటున్నది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ఈ మధ్య ఏకపక్షంగా కేసీఆర్ కుటుం బంపై చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఓ పార్టీకి అధ్యక్షుని హోదాలో ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు పిండం పెట్టాలంటూ నీతి మాలిన మాటలు మాట్లాడటం ఆయన రాజకీయ పరిణతికి అద్దం ప డుతున్నది. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో సూ ట్ కేసులతో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. విధానపరమైన విమర్శలు చేయటం రాని వ్యక్తి ఉద్యమ నేత పట్ల ఇలా మాట్లాడితే రేప టి రోజు ఆయన కనీసం బడుగు, బలహీన వరా ్గలు, ప్రజల గోడు వినే స్థితిలో ఉంటారా? అని గమనించాలి. గుణాత్మక మార్పు, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ఉద్యమ నేతను అవమానించడం తెలంగాణకే అవమానకరం. అటువంటి నా యకుల మానసిక స్థితిని అంచనా వేసి మనం నడచుకోకపోతే రేపటి రోజున తెలంగాణ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
ఆరున్నర దశాబ్దాల దోపిడీ, అణచివేతలో తెలంగాణ అణువణువు ఆగం కావడానికి కాంగ్రెస్ పార్టీ నే కారణమనే సంగతి తెలంగాణ బిడ్డలు ఇప్పుడు మరింత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వారి స్వార్థ రాజకీయాలకోసం నాడు తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయడమే మహపాపమైంది.నిజామాబాద్ వేదికగా ప్రధాని నెహ్రూ తెలంగాణను ఆంధ్రలో విలీనం చేస్తున్నప్పటికీ, ఎప్పుడైనా విభేదాలు వస్తే నిరభ్యంతరంగా రెండు ప్రాంతాలు విడిపోవచ్చని ఆనాడే అన్నాడు. కానీ అదే పార్టీ నాయకత్వం తెలంగాణకు అడుగడుగు నా అన్యాయం జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నెహ్రూ నుంచి నేటి వరకూ తెలంగా ణ గోసకు కాంగ్రెస్సే ప్రధాన కారణం. రాజకీయ అవసరం కోసం తెలంగాణను కాంగ్రెస్ మరుగున పడేసింది. నెహ్రూ మాటలకు విరుద్ధంగా వీరి నా యకత్వం వ్యవహరించిన తీరుతో తొలి విడత ఉద్యమం నుంచి మలివిడత ఉద్యమం వరకు అనేకమంది తమ ప్రాణాలు త్యాగం చేశారు.
తెలంగాణ విముక్తి కోసం ఉద్యమనేత కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం తీవ్రమవుతున్న సందర్భంలో స్వయంగా కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు తాము అనుకూలమని ప్రకటించారు. యూపీఏ అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపు దశాబ్దకాలం పాటు నాన్చడం వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు.
అయినా సరే కేసీఆర్ మొండి పట్టుదలతో పోరాటాన్ని ముమ్మరం చేశారు. అప్పటికే అన్ని విధాలుగా ప్రజాస్వామ్య పద్ధ తి లో శాంతియుత నిరసనల తో తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నది అందరికీ తెలిసిన వా స్తవం. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమం ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని 2009 డిసెంబర్ 9న ప్రకటించి తిరిగి వెనక్కి తీసుకొని తెలంగాణను అవమానపరిచారు. దీంతో తెలంగాణలో అనేక మంది విద్యార్థులు, యువత కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహన్ని జీర్ణించుకోలేక ఆత్మబలిదానాలకు పాల్పడ్డది. దీనికి కారణం కాంగ్రెస్ కాదా?
కాంగ్రెస్ పార్టీ ఆరున్నర దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించినప్పటికీ తెలంగాణకు జరుగుతున్న వెనుకుబాటుతనానికి ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోయింది. ఆంధ్ర పాలనలో తెలంగాణ అంతా ఎడారిగా మారి వలసలతో ఈ నేల గోస వ డ్ద్డా కనికరం చూపలేదు. తలాపున గోదావరి పారుతున్న గొడ్డూగోదాకు చుక్క నీరు అందకుండా ఆంధ్రకు తరలించి, తెలంగాణ రైతాంగం అంతా విలవిలలాడేలా చేశారు. కనీసం తెలంగాణ పల్లెల్లో తాగునీటి కష్టాలను దూరం చేయలేని స్థితికి తీసుకెళ్లారు. అంతటి తీవ్రమైన నిర్లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది.
తెలంగాణ స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలంలోనే అనేక గుణాత్మక చర్యలు చేపట్టింది. విద్య, వైద్యం లాంటి విషయాల్లో ప్రత్యేక చొరవ చూపడంతో నేడు వేల గురుకులాలు, జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. అంతటి అభివృద్ధి ఎజెండాతో కేసీఆర్ ఉద్యమంలా ముందుకు సాగుతున్న సందర్భంలో … రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ప్రజల్లో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్న కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గుర్తించాలి.
సంపత్ గడ్డం
78933 03516