CM KCR | కరెంటు కోతలు ఒకవైపు.. కరువు రక్కసి మరోవైపు.. రైతన్న బలవన్మరణాలు ఒకవైపు.. ప్రజల హాహాకారాలు మరోవైపు..వీటన్నింటికీ పరిష్కారం స్వరాష్ట్రం, స్వయం పాలనే మార్గమని నమ్మి.. నీళ్ళు, నిధులు, నియామకాల సాధన కోసం కేసీఆర్ శవయాత్రనా? తెలంగాణ జైత్రయాత్రనా అని ఉద్యమ నాయకుడు పద్నాలుగేండ్లు కొట్లాడితే తెలంగాణ ఇయ్యకతప్పని పరిస్థితి వచ్చింది.అరవై ఏండ్ల పాటు పాలకుల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో గణనీయ ఫురోగతిని సాధించింది.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో నిండు కుండల్లాంటి చెరువులతో కళకళలాడుతున్న పల్లెల వరకు ఎ న్నో మార్పులు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సబ్బండవర్గాలకు బీఆర్ఎస్ సర్కార్ సంక్షేమంలో పెద్ద పీట వేసింది. దళితులకు దళితబంధు, బీసీలకు బీసీ బంధు, ముదిరాజ్‌లు, మత్స్యకారులకోసం చేపల పంపిణీ, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, ముస్లీం మైనారిటీలకు ఆర్థిక సాయం, గృహలక్ష్మి, స్కూల్ విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, అన్నార్థులకు అన్నపూర్ణ భోజనం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కంటివెలుగు, రైతుబంధు, రైతు బీ మా, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం.
గత ప్రభుత్వాలు పరిష్కారం చూపని పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు, రైతు బీమా కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. గిరిజన ఆవాసాల్లో త్రీ ఫేజ్ కరెం ట్ లేని చోటకు లైన్లు వేయించారు. ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడెలకు, ప్రతి లంబాడీ తండాకు, వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించారు. నేడు పంటలు అమ్ముకునే మార్కెట్లలో, సర్కా రు ఆఫీసుల్లో దళారీలు, పైరవీకారులు లేరు. పల్లెలు, తండాలు ప్రశాంతంగా ఉన్నాయి. ధరణి తీసుకురావడంతో చాలా సులభంగా భూమికి రైతులు పట్టాలను తీసుకుంటున్నారు. తద్వారా రైతు బంధు, రైతు బీమా అందుతున్నాయి. రైతు బతుకుకు భరోసా ఇవ్వడంతో పాటు అనుకోకుండా కాలం చేస్తే కుటుంబానికి ఆసరాగా బీమా ఇస్తున్నది సర్కారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్ర కుల పేదలతో పాటు దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు ప్రత్యేక కృషి చేస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణలా బీఆర్ఎస్ పాలన సాగుతోంది.
రాకాసి కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏమున్నది కరువు తప్ప…సాగునీళ్లు లేక.. తాగు నీళ్లు లేక..కాంగ్రెస్ పాలనలో మనం పడ్డ గోసలు సాలవా? తెలంగాణ ప్రజలారా… కాంగ్రెస్ పార్టీని నమ్మితే మళ్లీ ఆగమైతం.. మోసపోతం.. గోస పడతం. ఉన్న తెలంగాణను ఊడగొట్టి 60 ఏండ్లు ఏడిపించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నది. పదవుల మీద తప్ప, ప్రజల మీద ప్రేమ లేని కాంగ్రెస్ నాయకులు నేడు 6 గ్యారెంటీల పేరుతో వస్తున్నా రు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీల డొల్లతనం… ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కర్ణాటకను చీకటిమయం చేసింది. అధికారం కోసం అడ్డగోలు గ్యారెంటీలిచ్చి.. ఇప్పుడు అమ లు చేయలేక చేతులెత్తేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్ల ఏలుబడిలో దాదాపు 80 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు.కానీ బలహీన వర్గాలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నది. బీసీలు ఎన్నికల్లో గెలవలేరని చెప్పే కుట్రతో ఓడిపోయే చోట బీసీలకు సీట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 60శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేస్తున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే ముందు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మీ నిజాయతీ, బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి. పేరుకే బీసీ ప్రధాని కానీ బీజేపీ ముమ్మాటికీ అగ్రవర్ణాల పార్టీ. కేంద్ర మంత్రి అమిత్ షా బీసీని సీఎం చేస్తామని ప్రకటించడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా బీసీలు ఎన్నటికీ బీజేపీని నమ్మరు.
అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహిత మే మా అభిమతం.. అంటూ మన తెలంగాణను విజయ తీరం వైపు నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. వలసల తెలంగాణని, వరి పంటల తెలంగాణ చేసింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో యావత్తు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. రైతుబంధు నిచ్చి, రైతుబీమా తెచ్చి, చెరువులు బాగుచేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను స స్యశ్యామలం చేసింది కేసీఆర్.పుట్టిన పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరిని ఆదరించే స్కీములు తె చ్చింది కేసీఆర్. కేసీఆర్ పాలనలోనే అరవై ఏండ్ల గా యాలు, మరువలేని వేదనలు అన్ని మాయమవుతున్నాయి. మంచి చేసిం డు.అందుకే మళ్లా కేసీఆరే వస్తాడు.
అంజి గోపి
89788 37933