‘మానవాభివృద్ధి అనేది ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగు పరుస్తుంది. అభివృద్ధితో ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలు మరింత స్వేచ్ఛగా, మెరుగ్గా జీవించగలుగుతారు.’
– ఐక్యరాజ్య సమితి అభివృద్ధి నివేదిక
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం దాకా తెలంగాణ పథకాలు.. దేశానికి రోల్ మాడల్‌గా నిలుస్తున్నాయి. దేశమంతా బీఆర్ఎస్ తరహా పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 నుంచి 20 14 దాకా తెలంగాణ కోసం ఉద్యమించి సాధించిన పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా ద్రోహం చేసినపార్టీలు కాంగ్రెస్ బీజేపీలు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల హయాంలో తెలంగాణలోని అన్ని రంగాలూ విధ్వంసమయ్యాయి. ఆనాటి తెలంగాణ నాయకులు సమైక్య పాలకులకు కొమ్ముకాయటం వల్లే మన ప్రాంతం తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. ఆ దోపిడీకి వ్యతిరే కంగా తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలి చి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.
తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు నీళ్లు, నిధులు, నియామకాల నినాదమే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్ననాడే తెలంగాణ ప్రజలకు అన్నిరంగాల్లో న్యాయం జరుగుతుందని కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్నపుడే చెప్పారు. అనంతరం 2014లో స్వరాష్ట్రం సిద్ధించాక, ఉద్యమ నాయకుడే పాల నా సారథియై ముఖ్యమంత్రిగా స్పష్టమైన కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. వారనుకున్న మేరకు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఆ సంకల్పం నెరవేరింది. సాగునీటి కోసం రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిచేయగా కోటి ఎకరాలకుపైగా సాగునీరందుతున్నది. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడున్నరేండ్ల అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి, అందరి దృష్టినీ ఆకర్షించింది తెలంగాణ రాష్ట్రం.
సంపదను సృష్టించాలి, దా న్ని ప్రజలకు పంచాలి. అన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందున్న తెలంగాణ రాష్ట్ర స్థూల జా తీయోత్పత్తి (జీఎస్డీపీ) ఇపుడు రెట్టింపైంది. జాతీయ సగటును మించి వృద్ధిరేటు సా ధించిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్టం ఆవిర్భావానికి ముందు తలసరి ఆదాయం రూ.95,361 ఉంటే.. ఆరేండ్లలో రూ.3,12,398లకు ఎగబాకి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇలా సృష్టించిన సంపదతో దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయ ని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో తెలంగాణ ప్రజలకు కనీస జీవన భద్రత ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం లో పేదరికం తగ్గుతున్నదని, తలసరి ఆదాయం పెరుగుతున్నదని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసింది. ఇక నిరుద్యోగులకు ఉపాధి కో సం ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో చేసే ఉద్యోగాలు మాత్రమే కాదు. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలేకాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితోపా టు, విద్యుత్, పోలీసు, వైద్యారోగ్య శాఖలు, విశ్వవిద్యాలయా లు, కార్పొరేషన్లు, సొసైటీల్లో నియామకాలు కూడా ప్రభు త్వ ఉద్యోగాల కిందకే వస్తాయి.
అంతేకాకుండా, కేవలం ప్రభుత్వశాఖలోనే కాకుండా ఒక నిరుద్యోగికి ఏ విధంగా పరిశ్రమ ల్లో, ఐటీ తదితర ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి కల్పించినా అవి కూడా ఉద్యోగాల కిందకే వ స్తాయి. ఈ క్రమంలో యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశ గా అనేక విధాలుగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షా 40 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు సీఎం కేసీఆర్. మరో లక్ష ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ నడుస్తున్నది. అలాగే, ప్రభుత్వేతర పారిశ్రామిక రంగం లో గత తొమ్మిదిన్నరేండ్లలో 17 లక్షల 21 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఐటీ రంగంలో రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
బహుశా ఏ రాష్ట్రంలో, ఇంత తక్కువకాలంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలోగానీ, ఉద్యోగ భద్రతా విషయంలోగానీ, ఈపాటికే విధుల్లో ఉన్న ప్రభుత్వ-ప్రభుత్వరంగ ఉద్యోగుల విషయంలోగానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తరహాలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా లబ్ధి చేకూర్చే చర్యలు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఇట్లా తెలంగాణలో అన్నిరంగాల్లో అభివృద్ధి శరవేగంగా సాగుతున్నది.
అందుకే, బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణను ఆగం పట్టిస్తరు. తస్మా త్ జాగ్రత్త. ఈ అభివృద్ధి యజ్ఞం ఇట్లనే కొనసాగాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం 115 స్థానాల్లో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి, సమర శంఖారావం పూరించింది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం ఉ రకలు వేస్తున్నది. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు. సబ్బండవర్గాల ప్రజల ఆశీర్వాదంతో మునుపటికన్నా ఎక్కువ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనడంతో సందేహం లేదు.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
నిరుద్యోగులకు ఉపాధి కోసం ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో చేసే ఉద్యోగాలు మాత్రమే కాదు. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలేకాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితోపా టు, విద్యుత్, పోలీసు, వైద్యారోగ్యశాఖలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో నియామకాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కిందికే వస్తాయి.