నిన్న మొన్న పుట్టిన తెలంగాణ బుజ్జవ్వకు అప్పుడే పదేండ్లు వచ్చాయా? కండ్లముందు ఇంకా ఆ జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. టాంక్‌బండ్‌పై ‘బతుకమ్మ’ ఆటలు, రోడ్లపై వంటావార్పులు, సకలజనుల సమ్మెలు గుర్తుకొస్తున్నాయి. శ్రీకాంతాచారి అగ్నికీలల బలిదానాలు, వందలాది అమరుల ఆత్మార్పణలు బాధిస్తూనే ఉన్నాయి. కళాకారుల పాటలు, మేధావుల మాటలు, జయశంకర్ సారు ఆశీస్సులు, మన నీళ్లు, నిధులు, నియామకాలు అని కొట్లాడి, కొట్లాడి తెచ్చుకొన్న మన తెలంగాణ బుజ్జవ్వకు పదేండ్లు నిండాయి.
పదేండ్ల బిడ్డకు నా బాపు.. దళిత బంధులిచ్చి, రైతుబంధులిచ్చి, వృద్ధాప్య పింఛనిచ్చి, షాదీముబారక్ ఇచ్చి బాధలు తీర్చిండు. మన ఊరు మనబడి ముస్తాబు చేసి, బడిడ్రెస్సులిచ్చి, పగటన్నం బెట్టి, మూడు కోడిగుడ్లు వారానికిచ్చి చదువు చెప్తున్నడు. కాళేశ్వరం కట్టి, మిషన్ భగీరథతో ఇంటింటికి నీరాయె, చెరువులన్నీ కళకళలాడబట్టె, సకాలాన పుష్కలంగా వానలు కురువ బట్టె. నిరంతర కరెంటు వెలుగులు చూసి ఊర్లన్నీ మురువబట్టె. ఎత్తిపోతల పథకాలతో బీడు భూ ములకు నీరంది సస్యశ్యామలమవుతున్నయి.
సెక్రటేరియట్ కట్టి, అం బేద్కర్‌ను అంతెత్తున నిలిపిండు. యాదాద్రిని ఎత్తి, కురవి వీరన్నకు మీసా లు జేయించిండు. అరవై ఒకటికి సర్వీసు పెంచి..అభివృద్ధిని కాంక్షించి, సర్వతోముఖాభివృద్ధి సాధించిం డు. నీవు చేసిన ఎన్నో మంచి పనుల వల్ల బుజ్జి తెలంగాణ మురుస్తుందే బాపు. మన తెలంగాణ స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, సంతోషంగా, నిత్యం ఎవరి దిష్టి తగులకుండా, మొత్తం దేశానికే తలమానికమై విలసిల్లేలా ఎదుగుతున్నది బాపు. నీ వద్దగల మంత్రదండం, నీ వాక్చాతుర్యం, అన్ని వర్గాలను మంత్ర ముగ్ధులను చేసి ఆనందపరుస్తున్నది బాపు. నీవు తెచ్చిన నీ తెలంగాణ బుజ్జవ్వను అపురూపంగా పెంచి పెద్దదాన్ని చేసి, నిత్య నూతనంగా, రూపొందించి, ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలిపావు బాపు. నీ ఖ్యాతి దిగంతాలకు వ్యాపిస్తున్నది. పదేండ్ల మన బుజ్జ వ్వ దేశానికే అగ్రతాంబూలమై అలరారుతున్నది. బాపు..నీవు అందరికీ ఆత్మీయుడవు. ఈ సంబురా లు, సంతోషాలు, దశాబ్ది ఉత్సవా లు, అభివృద్ధి అన్నీ నీకే అంకితం బాపు.
-సరోజాదేవి కాసర్ల
73311 29477