పరీక్ష పత్రాల లీకేజీని సాకుగా చూపి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టి పక్కదారి పట్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. రాష్ట్రంలో యువతీయువకుల జీవితాలను చీకటిమయం చేసేందుకు పలు పార్టీలు డ్రామాలాడుతున్నాయి. వారి పబ్బం గడుపుకోవడానికి ఉద్యోగార్థులను రోడ్లపైకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ తరుణంలో యువత వాస్తవాలను గమనించాలి. తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకొనే బాధ్యత తమ చేతుల్లోనే ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి.
స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం యువత సంక్షేమం, ఉద్యోగాలే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలను ఒకసారి పరిశీలిద్దాం. మన ఉద్యోగాలు మన బిడ్డల కే దక్కాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సమై క్య రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానంలో సమూల మార్పులు తెచ్చారు. దీనిపై దా దాపు రెండేండ్లపాటు కేంద్రంతో పోరాడి చివరకు విజయం సాధించారు. సమైక్య రాష్ట్రంలో జోనల్ విధానం ప్రకారం జిల్లా కేడర్‌లో 80:20 ఉండేది. అంటే వంద పోస్టులు పడితే అందులో 80 పోస్టులు స్థా నికులకు, 20పోస్టులు స్థానికేతరులకు ద క్కేవి. అలాగే జోనల్ కేడర్‌లో 70:30 శా తం, బహుళ జోన్లో 60:40 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి.
ఈ విధానంలో ఉన్న లోపాల వల్ల వివిధ క్యాడర్లలోని పోస్టులను స్థానికేతరులు తన్నుకుపోయేవారు. తద్వారా తెలంగాణ యువతకు ఉ ద్యోగవకాశాలు దక్కక పోయేవి. ఈ విష యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ 95 శా తం ఉద్యోగాలు ఈ ప్రాంత బిడ్డలకే దక్కాలన్న లక్ష్యంతో కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి ఆ ప్రతిపాదనల ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం అడుగడుగు నా అడ్డంకులు సృష్టించింది. అయి నా ఆ కుట్రలను ఛేదించి రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించారు. తద్వారా తెలంగాణలో 3 జిల్లాలు 7 జోన్లు, రెండు మల్టీజోన్లుగా ఏర్పాటయ్యాయి. ఫలితంగా గత భర్తీ విధానంతో పోలిస్తే జిల్లా స్థాయి పోస్టుల్లో అదనంగా 15శాతం, జోనల్ కేడర్‌లో 25 శాతం, బహుళ జోన్ పరిధిలో 35 శాతం పోస్టులు మన బిడ్డలకే దక్కే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి బిడ్డలకు దక్కాలన్న ఆశయం, లక్ష్యం కేసీఆర్‌కు ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
అలాగే 2014 జూన్ నుంచి 2022 ఫిబ్రవరి దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో 1,41,735 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇప్పుడు మరో 80-90 వేల పోస్టుల భర్తీకి వరుస
నోటిఫికేషన్లు ఇస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పడుతు న్న తరుణంలో ముందస్తుగానే ఈ ఉపద్రవాన్ని అంచనా వేసిన సీఎం కేసీఆర్ సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ ఐపాస్‌ను అమల్లోకి తెచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లుగా ఐటీ, ఇతరపారిశ్రామిక రంగాల్లో రూ. 3.31 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణకు తరలివచ్చాయి. మొత్తంగా 22.36లక్షల ఉద్యోగాలను తెలంగాణ ప్ర భుత్వం కల్పించింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఐటీ ఉద్యోగాల నియామకాల్లో 156 శాతం వృద్ధి సా ధించింది. 2014 నాటికి తెలంగాణలో 3, 23,396 మంది ఐటీ ఉద్యోగులుంటే, 2023 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 8,27 ,124కు పెరిగింది. ఈ విషయాన్ని ప్రభు త్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, దేశంలో 2021-22లో 4.50 లక్ష ల ఐటీ ఉద్యోగాలు వస్తే.. ఒక్క తెలంగాణలోనే 1,49,506 ఉద్యోగాలు సృష్టించినట్లు పలు ఐటీ సర్వేలు తేల్చిచెప్పాయి.
ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేటలో ఐటీ టవర్లు నిర్మించి విస్తరించారు. ఇక్కడితో ఆగకుండా. ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జీ సెంట ర్ల’ (టాస్క్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 7,09,530 మందికి శిక్షణ నిచ్చి వారికి అండగా నిలిచింది.
2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐర్) ఏర్పాటు చేస్తూ 2013లో దానికి ఆమోదం తెలిపిం ది. కానీ, 2014లో అధికారంలోకి వచ్చి న బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తద్వారా లక్షలాది ఉద్యోగాలు రాకుండా పోయాయి. కేంద్రం చేసిన ఈ ద్రోహన్ని యువత గుర్తించాలి.
అలాగే సాయుధ దళాల్లో తెలుగు రాష్ర్టాలనుంచే ఏడెనిమిది శాతం యువత ఉండేవారు. అగ్నిపథ్ పేరిట కేంద్రం తెచ్చిన పథకం మూలంగా వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇవేవి రాష్ట్ర బీజేపీ నేతలకు కనిపించవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని అమాయక యువతను రెచ్చగొట్టడమే
పనిగా పెట్టుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు యువత భవిష్యత్ ను వారి రాజకీయ ప్రయోజనాలకు వాడు కోవాలని చూస్తున్నాయి. ఈనేపథ్యంలో యువత రాజకీయ ఆటలో పావులు కావద్దు. రానున్న పరీక్షల్లో మరింత ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని కోరుకుందాం.
కడపత్రి ప్రకాశ్‌రావు
80966 77022