ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు
ఉపాధ్యాయుల సేవలు అమోఘం
ఉపాధ్యాయులు రేపటి తరాన్ని నిర్మించే నిపుణులు
ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కన్న గొప్ప
అనే మాటలు, ఉపన్యాసాలు విని ఉబ్బితబ్బిబ్బవుతాం
ఎన్నికల్లో విధులను నిర్వహించాం
రెమ్యూనరేషన్ కోసం
న్యాయం అడిగితే కేంద్ర
బలగాలతో లాఠీచార్జి
చిన్నప్పుడు మీకు మేము బెత్తంతో కొట్టింది బాగుపడుమని
మీరు పెద్దయ్యాక లాఠీలతో కొడ్తరని ఊహించలేదయ్యా?
మీకు విద్యాబుద్ధులు నేర్పింది, నేర్పిస్తున్నది
మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరాలని
మీరు తోసివేస్తారని, దౌర్జన్యం చేస్తారని, అవినీతి అధికారులకు కొమ్ము కాస్తారని ఎందుకనుకుంటాం
ఉపాధ్యాయులు సహనపరులు
ఉపాధ్యాయులు నిస్వార్థ సేవకులు
ఉపాధ్యాయులను కొట్టినా, తిట్టినా
అడిగే దిక్కుండదనే ధీమానే కదా?
ఉపాధ్యాయులు ఉద్యమాలు పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు కూలాయి
ఉపాధ్యాయులు లేనిదే
సర్పంచ్ నుంచి పార్లమెంటు వరకు ఏ ఎన్నికలు జరుగవు
జనాభా లెక్కల సేకరణకు, ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరుగుటకు
ఉపాధ్యాయులే కావాలి
ఉపాధ్యాయులు అంటే ఎందుకీ చులకనా?
ఉపాధ్యాయుల్లో ఐకమత్యం లేకపోవడం
ఉపాధ్యాయులను కొట్టినా, తిట్టినా
మెమోలు ఇచ్చి సస్పెండ్ చేసినా అడిగే వారెవరు?
ఉపాధ్యాయులకు సెలవులెక్కువ
వాన వచ్చిన, ఎండ కొట్టిన సెలవేనంటూ ఏదో గొప్ప పని చేసినట్టు మాటలు
ఉద్యోగులకు 28 రోజులు పోలీసులకు 45 రోజుల ఈఎల్
సెలవులు కోల్పోవడం లేదా?
ఉపాధ్యాయులు ఏ మంచి పనిచేసినా అందరం మెచ్చుకుందాం!
ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల సహాయ సహకారాలతో
బదిలీలు, పదోన్నతులు సాధిద్దాం!
ఉపాధ్యాయుల ఐకమత్యమేమిటో లాఠీచార్జి చేసిన కేంద్ర బలగాలను
ఉసిగొల్పిన ఊసరవెల్లులకు
ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధిచెప్దాం!
ఎన్నో తప్పులను చేసినా క్షమించే ఉదార స్వభావం కలిగిన ఉపాధ్యాయులపై లాఠీ
అవినీతి అధికారుల ఠీవి
సమాజాభివృద్ధికే అవరోధం, ఆటంకం, ఆటవికం, విచిత్రం, విడ్డూరం ఆశ్చర్యం …
(నారాయణఖేడ్‌లో ఉపాధ్యాయులపై లాఠీచార్జి చేసినందుకు స్పందిస్తూ..)
డాక్టర్ ఎస్.విజయభాస్కర్
92908 26988