కాంగ్రెస్ గెలిస్తే సోనియాగాంధీ తనకే సీఎం పోస్టు ఇస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా మరోసారి తాను సీఎం రేస్‌లో ఉన్నట్టు గుర్తుచేశారు. మీకు సోనియమ్మ ఇస్తే తమకు ఇచ్చే గాడ్ఫాదర్లు కూడా అధిష్ఠానంలో ఉన్నారని ఇతర నేతలు గుర్తుచేస్తున్నారు. రేవంత్రెడ్డికేమో డీకే శివకుమార్, భట్టి విక్రమార్కకేమో మల్లికార్జున్ ఖర్గే, సీతక్కకేమో రాహుల్‌గాంధీ, మధుయాష్కీకేమో కేసీ వేణుగోపాల్, జగ్గారెడ్డికేమో బోసురాజు సీఎం పోస్టు ఇప్పిస్తారని వారు కలలు గంటున్నారు. ఏమిటీ? ఇంతమందికి సీఎం పోస్టు ఇవ్వడం సాధ్యమేనా? అనే సంశయం అక్కర్లేదు. వీరందరు సీఎం పోస్టుకు పోటీ పడటానికి ఓ కారణముంది. సీఎం పోస్టు అడిగితే కనీసం మంత్రి పోస్టు అయినా గ్యారెంటీగా తగలుతుందని వీరి ముందుచూపు. మొదట సీఎం రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగితే ఆ సీటులో కూర్చునే ఆయనే తనకు అడ్డురాకుండా మంత్రి పదవి ఇప్పిస్తారన్నది వ్యూహమట. మన కాంగ్రెస్ నేతలు మహా ముదుర్లని ఊరికే అన్లేదోయ్.