దేశం పరిస్థితి ఇలా ఎందుకున్నది?
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు.
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్రం. విదేశాల్లో ఎక్కడచూసినా భారతదేశ మేధావులు. దేశంలో 40 శాతం ఉత్సాహవంతులైన యువత. కన్నపిల్లల మీద అమిత ప్రేమ ఉండి వారికోసం తమ సమయం, ధనం ఏదైనా ఖర్చుపెట్టే అమ్మత హృదయులైన తల్లిదండ్రులు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత సారవంతమైన భూమి, జీవనదులు, కష్టపడే రైతులున్న దేశంలో ఇంకా సమస్యలెందుకున్నట్టో.
యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో మోసం చేసే బాబాలు, జ్యోతిష్యులు, ఉద్రిక్తతలు పెంచే వీడియోలు తప్ప యువతకు నిజంగా పనికివచ్చేవి 10 శాతం కూడా లేవు. తమ కాళ్ల మీద తాము నిలబడాలనే స్వాతంత్య్రం కంటే ఇంట్లో పెద్దవాళ్ల మాట వినకూడదన్నదే స్వాతంత్య్రం అనుకుంటున్నారు యువత. అటువంటి వాళ్లను అర్థం చేసుకోలేక పెద్దవాళ్లు బాధపడుతున్నారు.
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు. ఉద్యోగాలున్నా సరైన జీతాల్లేవు. ఈ పదేండ్లలో పెరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, విస్తరించిన వ్యాపారాలతో భారతీయులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ధనవంతులు, పేదవాళ్లు. ఉన్నవాళ్లు లీటర్ 3 లక్షల హిమాలయాల మంచినీళ్లు తాగుతుంటే, కటిక పేదవాళ్లు కుంటలలో నీళ్లు పట్టుకుంటున్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తిండి ఇవ్వకపోయినా కనీసం ప్రాణం నిలిపే తాగునీరు ఇవ్వలేకపోయిందా? అసలు ఈ దుస్థితికి కారణాలు కనుక్కుంటే, పరిష్కారాలు చూసుకోవచ్చు.
వెయ్యేండ్ల తర్వాత స్వాతంత్య్రం వచ్చిన దేశంలో ముఖ్య అవసరాల గురించి అప్పటి నాయకులు ఆలోచించారా? 1947 వరకు తొక్కిపెట్టబడిన ప్రజలకు ఏం కావాలి? సరిపోయినంత ఆహారం, తెలివిని ఉపయోగించటానికి విద్య, ఆరోగ్యానికి వైద్యం. మరి మొదటి ప్రధాని ఏం చేశారు? దేశమంతా కావలసిన సాగునీటికి ప్రణాళికలు వేశారా? లేదు. 90 శాతం నిరక్షరాస్యులుగా ఉన్న ప్రజలకు నిర్బంధ విద్య 12వ తరగతి దాకా విధించి, పాఠశాలలు తెరిచారా? లేదు. ఐఐటీలు, ఐఐఎంలు తెరిచి అప్పటికే విద్యార్హతలున్నవారు ఇంకా పైకి చదవటానికి దోహదం చేశారు. ఆ ప్రయత్నం దేశం కోసమైతే బాగుండేది కానీ, ఆ విద్యార్థులు ప్రజాధనంతో చదువుకొని డిగ్రీ రాగానే ఆమెరికా వెళ్లిపోయారు. వైద్య వృత్తిలోనూ అదే జరిగింది. ఇంజినీర్లు, మేనేజర్లు, డాక్టర్లు ఇలా తెలివైనవారి మేధోవలస జరిగి మన ప్రధాని నె హ్రూ అమెరికాకు ‘జాతిపిత’ అయ్యారు. అంత విలువైన విద్య గరిపినవాళ్లకు కనీసం ఐదేండ్లు దేశంలోనే పని చేయాలన్న నిబంధన పెట్టాలని అప్పటి మన ప్రధానికి తట్టలేదు. ఎరిత్రియా అన్న తూర్పు ఆఫ్రికా దేశంలో బీఏ చేసినవాడు కూడా పదేండ్లు దేశంలోనే పనిచేయాలనే నిబంధన ఉన్నది నేటికీ. మరి విదేశాల్లో చదివిన నెహ్రూకు ఆ తెలివి ఎందుకు లేదో ఆశ్చర్యమే! లేక కావాలనే అలా చేశారా?
ఇక ఆహారం అందించే రైతుకు కావలసిన నీరు, విద్యుత్తు, పెట్టుబడి ప్రభుత్వం ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. నేటికీ 75 శాతం వ్యవసాయదారులు వర్షం మీదే ఆధారపడుతున్నారు. ఇక సునామీ లాగ విరుచుకుపడ్డ ప్రపంచీకరణలో బాగుపడ్డది వ్యాపారస్థులు. నష్టపోయినది సామాన్య ప్రజలు. గాంధీజీ ఒక మాటన్నారు ‘వ్యాపారం విజృంభిస్తే మానవ విలువలు నశిస్తాయి’. (వేర్ కామర్స్ డామినేట్స్, దేర్ మోరల్స్ డిగ్రేడ్) అని. ఇప్పుడు అదే చూస్తున్నాం. అధిక సమయం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము, తమ రాజకీయ నాయకుల అవినీతిని కాపాడుకుంటే, ఇప్పుడు ఒక దశాబ్ద కాలం నుంచీ పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ తన గుంపును గుజరాతీ కార్పొరేట్లకి కుదించింది. తమది అవినీతి రహిత పార్టీ అని గొప్పలు చెప్పుకొంటున్నది. ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం అవినీతి ఎక్కువ ప్రమాదకరమా? ఆశ్రిత పక్షపాతం అంతకంటే ప్రమాదకరమా అని! రెండోదే ఎక్కువ ప్రమా దం అనిపిస్తున్నది. ఆ వ్యాపారస్థులు ప్రపంచ కుబేరులవుతుంటే దేశంలో తలసరి ఆదాయం క్షీణించిపోతున్నది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో కొన్ని కోట్ల మంది దిగువ, మధ్య తరగతివారు పేదరికంలోకి, మధ్య మధ్యతరగతివారు దిగువకి, ఎగువ మధ్య తరగతివారు తమ కిందివర్గమైన మధ్య మధ్య తరగతికి జారిపోయారు. ఉద్యోగాలు, ఉపాధిలేని యువతలో నేర ప్రవృత్తి పెరుగుతున్నది. ఆర్థిక వనరులు సరిగా లేక సంసారాలు విసుగు, నిరాశతో అవిచ్ఛిన్నమవుతున్నాయి. డబ్బుకు తప్ప ఇంక దేనికీ విలువ ఇవ్వకుండా తయారవుతున్నారు దాదా పు 100 కోట్ల మంది. ఇంక భవిష్యత్తు ఊహించాలంటేనే భయంకరంగా కనిపిస్తున్నది.
ఇక ఇండియా షైనింగ్ అని బీజేపీ ఎప్పటినుంచి మొదలుపెట్టిందో సగటు భారతీయులు అదే నిజమని నమ్మి గొప్పలు చెప్పుకోవడమే తప్ప, నిజమైన విలువలేమిటో తెలుసుకోవటం లేదు. రామాయణం, మహాభారతం, భగవద్గీత మనదనే ప్రవచనాలు వింటున్నారు కానీ, అసలు విలువలు పాటించటం లేదు. భగవంతుడంటూ నైరూప్య (అబ్స్ట్రాక్ట్) ప్రవచనాలు యువతకు రుచించటం లేదు.
ఏ పనీ లేనివాళ్లు ప్రేమలని వెంటపడి వాళ్లని వీళ్లు, వీళ్లని వాళ్లు మోసం చేసుకుంటూ చంపేదాకా వెళ్తున్నారు. శాస్త్రీయమైన విజ్ఞానం అం దించేవాళ్లే లేరు. యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో మోసం చేసే బాబా లు, జ్యోతిష్యులు, ఉద్రిక్తతలు పెంచే వీడియోలు తప్ప యువతకు నిజంగా పనికివచ్చేవి 10 శాతం కూడా లేవు. తమ కాళ్ల మీద తాము నిలబడాలనే స్వాతంత్య్రం కంటే ఇంట్లో పెద్దవాళ్ల మాట వినకూడదన్నదే స్వాతంత్య్రం అనుకుంటున్నారు యువత. అటువంటి వాళ్లను అర్థం చేసుకోలేక పెద్దవాళ్ళు బాధపడుతున్నారు.
ఆర్థికంగా తృప్తి కాక, సంసారంలో బాధలతో కోట్ల కుటుంబాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. అసూయ, ద్వేషాలతో ప్రజలు దిగజారిపోతున్నారు. సంయమనం, నిజాయితీ, నిబద్ధత, పక్కవాడి ప్రగతి చూసి సంతోషించటం, బీదవారికి దానం చేయటం లాంటి గుణాలు మాయమవుతున్నాయి. మరి ప్రజలను ఎలా బాగుచేయాలో ఆలోచించవలసిన అవసరం, బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది.
-కనకదుర్గ దంటు
89772 43484
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

