ప్రధాని మోదీ గారూ చెప్పింది నిజం
తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ నూకలు తినండి అని అవమానించిన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అవును.. ముమ్మాటికీ తెలంగాణ
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి!
ప్రధాని మోదీ గారూ చెప్పింది నిజం!
తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ నూకలు తినండి అని అవమానించిన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
విభజన హామీలను గాలికొదిలేసి తెలంగాణను గందరగోళం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న వారి పట్ల
జాగ్రత్తగా ఉండాలి.
పేపర్ లీకేజీలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణ రైతులను నట్టేట ముంచేందుకు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలనుకున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణలో ఉన్న వనరులను అదానీకి కట్టబెట్టాలని అనుకుంటున్న వారి పట్ల
జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్న వారి పట్ల ముమ్మాటికీ జాగ్రత్తగా ఉండాలి.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని తెలంగాణలో శిఖండి రాజకీయాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈ విషయం చెప్పడానికే ప్రధాని మోదీగారు డిల్లీ నుంచి తెలంగాణ గల్లీకి వచ్చారు.
పాపం! మోదీగారు ఒక విషయం తెలుసుకోవాలి.
తెలంగాణ ప్రజలు విజ్ఞులు. జాగ్రత్తగా ఉన్నారు కాబట్టే సీఎం కేసీఆర్ గారి నాయకత్వానికి అనుక్షణం అండగా నిలుస్తున్నారు.
ఉచిత సలహాలు ఇచ్చి, చేతులు దులుపుకొని ప్రజల చెవిలో పువ్వులు పెట్టి పోవడానికేనా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వచ్చింది అని జనం ప్రశ్నిస్తున్నారు. (సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్)