దేశ పరిస్థితుల గురించి సావధానంగా ఆలోచించేవారు ఎవరైనా, బీఆర్ఎస్ తన లక్ష్యసాధనలో విజయవంతం కావాలని కోరుకొంటారు. గత 75 ఏండ్లలో ప్రభుత్వాలు ఈ దేశ వనరులకు, శక్తి యుక్తులకు తగినట్లు చిత్తశుద్ధితో పరిపాలించి ఉంటే, మనం ఈ రోజు ప్రపంచ ఆకలి సూచీలో 107 వ స్థానానికి, మానవాభివృద్ధి సూచీలో 131 వ స్థానానికి పతనమయేవారం కాదు. అయినప్పటికీ ఉద్యమాలు మినహా విప్లవమనేది రాలేదంటే అది ప్రభువుల అదృష్టమనాలి. దేశానికి ఈ దుఃఖమయ స్థితిని తప్పించేందుకు కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్కు తన ఎజెండా దాని అమలే కరదీపికలు కాగలవు.
బీఆర్ఎస్ కొత్తగా ఏర్పడుతున్న ఒక షరా మాములు రాజకీయ వేదిక కాదు. అది ఒక సరికొత్త దృక్పథంతో కూడిన ఆలోచన. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ విధానాలపై స్వాతంత్రోద్యమం ప్రభావాలు ఉండేవి. ఆ విధానాలు, రాజ్యాం గం, చట్టాలు సమగ్రంగా లేకపోయినా కనీసం సక్రమంగా అమలై ఉంటే దేశం పరిస్థితి మరొక విధంగా ఉండేది. ఈ పని జరిగితే ఈ రోజు బీఆర్ఎస్ అవసరం ఏర్పడేది కాదు.
కేసీఆర్ ఈ నెల తొమ్మిదవ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటును ప్రకటిస్తూ, దేశ సమగ్రాభివృద్ధికోసం సరికొత్త విధానాల రూపకల్పన ఇప్పటికే మొదలైందని, వాటిని త్వరలోనే వెల్లడించగలమని అన్నారు. అవి ఆర్థికరంగం, వ్యవసాయం, జలవిధానా లు, విద్యుత్తు, పర్యావరణం, పారిశ్రామికం, విద్యా వైద్యాలు, బడుగు వర్గాల సముద్ధరణ, మహిళాసాధికారత మొదలైనవని ఆయన సూచించారు. అంతేకాదు, ఇంకా నిర్దిష్టంగా మాట్లాడుతూ కొన్ని ప్రకటించారు. అవి, బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత రెండేండ్లలోనే దేశమంతటా 24 గంటల విద్యుత్తు, దేశంలోని రైతులందరికీ రైతుబంధు, రైతుబీమా, బడుగువర్గాల వారికి దళితబంధు తరహాలోనే ఒక సముద్ధరణ పథకం. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో 2014 నుంచే వీటిలో కొన్నింటిని అమలు పరుస్తూ, తర్వాత మరికొన్ని పథకాలను చేపట్టిన విషయం తెలిసిందే. అవి గాని, ఇంకా వేరేవి గాని ఏ రూపంలో ఉండగలదీ బీఆర్ఎస్ విధాన ప్రకటనలు జరిగినప్పుడు మనకు సమగ్రంగా తెలియవస్తుంది.
కేసీఆర్ సూచించిన పథకాలు, విధానాలు ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నాయి. అవి రాష్ట్రంలో ప్రజాదరణను పొంది వ్యవసా య తదితర ఉత్పత్తి రంగాలలో, వివిధ సంక్షే మ రంగాలలో ఆయా అభివృద్ధి సూచీలను స్పష్టమైన రీతిలో మెరుగు పరుస్తున్నాయి. ఈ మాట రాష్ట్ర ప్రభుత్వం తానుగా చెప్పటమేగా క, ఈ విషయాలను జాతీయ స్థాయిలో మదిం పు చేసే కేంద్ర మంత్రిత్వశాఖలు, స్వతంత్ర ఏజెన్సీలు, పలువురు ప్రముఖులు, ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు, పలు అంతర్జాతీయ సంస్థలు కూడా తరచూ ధృవీకరిస్తున్నదే. వాస్తవానికి ఈ విధంగా తను రాష్ట్ర స్థాయిలో సాధిస్తున్న విజయాలే కేసీఆర్కు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టి బీఆర్ఎస్ ఆలోచనకు ప్రేరణగా, పునాదిగా మారుతున్నాయనాలి. కనుక, ఎటువంటి ప్రిజుడిసెస్, సినిసిజం లేకుండా ఆలోచించినట్లయి తే, మొదట అన్నట్లు దేశ పరిస్థితుల గురించి కూడా సావధానంగా సమీక్షించుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎంత అవసరమైన ఆలోచనో బోధపడడం ఎవరికీ కష్టం కాకూడదు.
ఇక్కడ గ్రహించవలసిన చాలా ముఖ్యమైన విషయం ఒకటున్నది. బీఆర్ఎస్ అనేది కేవ లం కొత్తగా ఏర్పడుతున్న ఒక షరా మాములు రాజకీయ వేదిక కాదు. అది ఒక సరికొత్త దృక్పథంతో కూడిన ఆలోచన. దేశానికి స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి దీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ విధానాలపై స్వాతంత్రోద్య మం ప్రభావాలు ఉండేవి. ఆ విధానాలు, రాజ్యాంగం, చట్టాలు సమగ్రంగా లేకపోయి నా కనీసం సక్రమంగా అమలై ఉంటే దేశం పరిస్థితి మరొక విధంగా ఉండేది. ఈ పని జరిగితే ఈ రోజు బీఆర్ఎస్ అవసరం ఏర్పడేది కాదు. అది జరగనందువల్లనే రెండవ ఎన్నికల నాటికే కాంగ్రెస్ బలహీనపడటం మొదలై, 1960లు వచ్చేసరికి దేశంలోని వివిధ వర్గాలు అశాంతికి గురవుతూ, 1967లోనే కాంగ్రెస్ పలు రాష్ర్టాలలో అధికారం కోల్పోయింది. దేశంలో నక్సలైట్ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత నుంచి దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
ఇక్కడ గమనించవలసింది ఏమంటే 1947 నుంచి 1967 వరకు 20 సంవత్సరాల కాలం లో కాంగ్రెస్ వైఫల్యాల వల్ల కొత్తమలుపు తిరిగిన దేశ రాజకీయాలు, సమగ్ర అభివృద్ధి 1967 నుంచి ఈ 2022 వరకు 55 సంవత్సరాల సుదీర్ఘకాలంలో కూడా ఎన్నెన్ని ఫ్రంట్లు
అధికారానికి వచ్చినా స్థిరపడలేదు. ఈ దేశానికి అవసరమైన విధంగా స్థిరపడలేదు. కనీసం అప్పుడు ఆ పని జరిగినా ఈ రోజు బీఆర్ఎస్ అవసరం ఉండేది కాదు. ఈ వరుస వైఫల్యాల కు కారణం ఏమిటన్నది లోతుగా, సీరియస్గా ఆలోచించవలసిన ప్రశ్న.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నెన్నో సమస్యల మధ్య ఎన్నెన్నో ఆశలతో స్వాతంత్రోద్య మం సాగించిన ఈ దేశ ప్రజలు వర్తమానానికీ, భవిష్యత్తుకూ తగిన రాజకీయాలు, అభివృద్ధి విధానాలను తగిన అవగాహనతో, చిత్తశుద్ధితో అనుసరించిన పార్టీ ఈ 75 సంవత్సరాల కాలం లో లేకపోయిందన్నమాట. పైన చెప్పుకొన్న దశ లో మొదట కాంగ్రెస్ వైఫల్యం తర్వాత, రెండవ దశలో ఇతర పార్టీల నుంచి అనేక వేదికలు
తాము ప్రత్యామ్నాయమంటూ ముందుకు వచ్చాయి. అవి సైతం విఫలమయ్యాయి. తేలిందేమంటే, వాటికి అధికార కాంక్షలు తప్ప, ఏ లోపం వల్లనైతే కాంగ్రెస్ విఫలమైందో ఆ లోపా న్ని తీర్చగల సమగ్రమైన ఎజెండాలు, ఆచరణ లేకపోయాయి. ఎజెండాలు, ఆచరణల కెమిస్ట్రీ లేని చోట, అధికార కాంక్షల ఫిజిక్స్ మాత్రమే ఉన్నప్పుడు అటువంటి వేదికలు సహజంగానే కుప్పకూలుతాయి. ఇపుడు బీజేపీ వద్ద కూడా మతతత్వం కల్పించే కృత్రిమ స్థిరత్వం తప్ప ఈ దేశానికి స్వాతంత్రోద్యమ ఆకాంక్షల కాలం నుంచి అవసరమైన సమగ్రాభివృద్ధితో కూడిన రాజకీయ స్థిరత్వం కాదు. కనుకనే వివిధ సూచీలలో పైన పేర్కొన్న విధంగా పతనమవుతున్నది దేశం. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే వికృతమైన రాజకీయ స్థిరత్వమవుతున్నది.
ఇటువంటి బాధాకరమైన పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ చెప్పే కొత్త ఎజెండాల ఆలోచన దేశానికి అవసరమవుతున్నది. స్వాతంత్రోద్యమ కాలపు ఆకాంక్షలు, దేశ వర్తమాన, భవిష్యత్తు అవసరాలకు తగిన సమగ్రమైన అజెండాలు వాటి ఆచరణలను బీఆర్ఎస్ దేశానికి ప్రతిపాదిస్తున్నది. ఈ అజెండాలు, విధానాలలో సమగ్రత, దూరదృష్టితో కూడిన దార్శనికత ఉన్నా యి. కేసీఆర్ పదేపదే అంటున్నట్లు గుణాత్మకమైన పరివర్తన తేగల స్వభావం ఉంది. మొద ట కాంగ్రెస్, తర్వాత వివిధ ఫ్రంట్లు ఈ దేశ ప్రజలను నిరాశ పరిచాయి. తమ అధికార కాంక్షలు, అసమర్థ పాలనలు, అరకొర అభివృద్ధి వల్ల, అవినీతి విధానాలలో సమగ్రత, దూరదృష్టి, దార్శనికత గానీ, అందుకు కట్టుబడి చిత్తశుద్ధితో కృషిచేసే నీతిగానీ లేకపోవటం వల్ల. ఈ విధమైన 75 సంవత్సరాల కొరతలను బీఆర్ఎస్ తీర్చగలదనే భావన ప్రజలకు కల్పించేందుకు ఆ పార్టీ దృక్పథ ప్రకటన, అవగాహనా పత్రాలు, వివిధ రంగాలకు సంబంధించిన విధాన ప్రకటనలే తొలి ఆశాకిరణాలు కాగలవు. ఈ విధానాలను విస్తృతంగా దేశంలో మూలమూలలకు అన్ని వర్గాల ప్రజల వద్దకు తీసుకువెళ్లటం బీఆర్ఎస్ చేయవలసిన పని.