ద్వాపరయుగంలోని దుర్యోధనుడే నేడు కలియుగంలో రేవంత్‌రెడ్డి రూపంలో జన్మించారేమో. అందుకే కౌరవ అగ్రజుడు దుర్యోధనుడికి, రేవంత్‌రెడ్డికి చాలా సారూప్యతలు ఉన్నాయి. దాయాది సోదరులైన పాండవులపై ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోయిన దుర్యోధనుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారణమయ్యాడు. తను నాశనం అవడమే కాకుండా నూరుగురు సోదరులతో పాటు కురు సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు.
దుర్యోధనుడు లాగానే తెలంగాణ సాధకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్, ఆయన కుటుంబంపై ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలతో నిలువెల్లా రగిలిపోతున్న రేవంత్‌రెడ్డి పాలనను పక్కనపెట్టి కక్ష సాధింపులకు దిగుతున్నారు. తద్వారా తాను నాశనం అవడమే కాకుండా పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణ, పోరాటం తర్వాత తెలంగాణలో తొలిసారిగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా నాశనం చేస్తున్నారు. జన్మలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుం డా గట్టి పునాదులు వేస్తున్నారు. పరిపాలనపై పట్టు లేదు, పబ్లిక్ పాలసీపై అవగాహన లేదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే సమర్థత, చిత్తశుద్ధి లేదు, సంపద సృష్టించే తెలివి లేదు. నరనరాన ఈర్ష్య, ద్వేషం, అహంకారం నింపుకొని రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నరు.
రేవంత్‌రెడ్డి తన అసమర్థతను, బీసీల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలుతున్నారు. జుగుప్సాకరమైన వ్యా ఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనకపోవడం వల్లే కులగణనలో తప్పిదాలు జరిగినట్టు కేసీఆర్‌పై దాడి చేయడం హేయం. కేసీఆర్ కులగణనలో పాల్గొంటే వారి సామాజికవర్గం లెక్కల్లోకి వస్తారు. బీసీలకు ఫాయిదా ఏమీ లేదు. అయితే కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనలేదనేది అబద్ధం. కులగణనలో జరిగిన తప్పిదాన్ని ప్రజలు ఎత్తిచూపెట్టడంతో తేలు కుట్టిన దొంగ లెక్క రేవంత్‌రెడ్డి చిన్నపెద్ద తారతమ్యం లేకుండా తండ్రి సమానులైన కేసీఆర్ పైనా, వారి కుటుంబంపైనా, వారి కులంపైనా బూతు పురాణానికి తెగబడ్డారు. బీసీ సామాజికవర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచన రేవంత్‌రెడ్డికి అసలు లేదు. అందుకే తప్పుల తడకతో, కాకి లెక్కలతో కులగణన నివేదికను నింపేశారు. తన సొంత సామాజిక వర్గం సంఖ్యను పెంచి లబ్ధి చేకూర్చడానికి రేవంత్ ఈ సర్వేను వాడుకున్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని పేర్చిన నివేదిక ఇది. అధికార పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కూడా ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుట్ర చేశారని ఆరోపిస్తూ, ఆయనను బీసీలు బహిష్కరించాలని కూడా పిలుపునిస్తున్నారు.
గత పదేండ్లలో బీసీ జనాభా 11 లక్షలు మాత్రమే పెరిగిందని చెప్పడం దేనికి సంకేతం. సమగ్ర కుటుంబ సర్వేలో 56 శాతంగా ఉన్న బీసీలు నేడు 46.25 శాతానికి ఎలా పడిపోయారు. ఓసీల జనాభా 15.79 శాతానికి ఏ ప్రాతిపదికన పెరిగింది? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉండగా.. 2014లో సమగ్ర కుటుంబ సర్వే నాటికి 1.03 కోట్లకు చేరింది. తాజాగా చేసిన సర్వేలో కుటుంబాల సంఖ్య 1.15 కోట్లుగా తేలింది. అంటే ఈ పదేండ్ల కాలంలో 12 లక్షల కుటుంబాలు మాత్రమే పెరిగాయా?
కులగణనలో 16 లక్షల మంది (3.1 శాతం) సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్తున్నది. అలాంట ప్పుడు సర్వేను ఏ ప్రాతిపదికన ప్రామాణికంగా తీసుకోవాలి? 2011లో యూపీఏ సర్కారు చేసిన సామాజిక, ఆర్థిక కులగణనలో సుమారు 1.13 శాతం మంది పాల్గొనలేదని సాకుగా చూపుతూ ఆ వివరాలను వెల్లడించలేదు. కానీ నేడు 3.1 శాతం ప్రజలు సర్వేలో పాల్గొనకపోయినా కులగణన శాస్త్రీయంగానే జరిగిందని, దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొడుతున్నది.
సర్వేను సమగ్రంగా చేసినట్టు మొదట బుకాయించిన ప్రభుత్వం.. తప్పుల తడకగా ఉన్న సర్వేపై ఇటు బీసీలు, అటు బీఆర్ఎస్ పార్టీ మండిపడటంతో తోకముడిచి తప్పును ఒప్పుకున్నది. బీసీ సంఘాలు, మేధావులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముళ్లకర్ర పట్టుకుని వెనుకనుంచి గుచ్చడంతో ఇప్పుడు మళ్లీ చెంపలు వాయించుకుని రీ సర్వే చేస్తామని చెప్తున్నారు. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర క్యాబినెట్ మంత్రులు ఎవరూ కులగణనను సీరియస్‌గా తీసుకోలేదు. ఏ ఒక్క జిల్లాలోనూ కనీసం సమావేశాలు, రివ్యూలు నిర్వహించలేదు. ప్రజలను సమాయత్త పరచలేదు. బీసీ సామాజిక వర్గా న్ని తక్కువ చేసి చూపాలనే ఈ కుట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే కాదు భారత రాజ్యాంగ శిక్షా స్మృతి ప్రకారం ముమ్మాటికీ నేరమే. కాబట్టి బీసీలపై రేవంత్ ప్రభుత్వం చేసిన కుట్రపై సీబీఐ విచారణ జరిపించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కన్వర్టెడ్ బీసీ అని రేవంత్‌రెడ్డి చెప్పడం వ్యర్థ ప్రేలాపన. రేవంత్ అన్నట్టు మోదీ బీసీగా మారినందు వల్లే కుల గణనను తిరస్కరించింది నిజమే అయితే, రేవంత్ తాను స్వతహాగా ఫ్యూడల్ కాబట్టి, కులగణనను తారుమారు చేసిండా?
రేవంత్‌రెడ్డి ముందుగా చట్టాల గురించి తెలుసుకోవాలి. కులాల ప్రస్థానం, సామాజిక పరివర్తనం గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతున్నది. Identification is different from conversion. BC’s are identified, not converted. బీసీల గుర్తింపునకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆర్టికల్స్ 15(4), 16లను పొందుపరిచారు. అంతేకాదు ఆర్టికల్ 340 ప్రకారం బీసీల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిషన్లను కూడా నియమించవచ్చు. ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా 1953లో కాలేల్కర్ నేతృత్వంలో తొలి బీసీ కమిషన్ ఏర్పాటు అయింది. 1955లో కాలేల్కర్ సమర్పించిన నివేదికలో 2,399 సామాజిక వర్గాలను బీసీ కులాలుగా గుర్తించారు. ఆ తర్వాత 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1980లో సమర్పించిన మండల్ నివేదికలో 3,743 సామాజిక వర్గాలను బీసీ కులాలుగా గుర్తించారు. దేశ జనాభాలో సుమారుగా 52 శాతం మంది బీసీలు ఉన్నట్టు ఆ కమిషన్ తేల్చింది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (అ) 2006 నివేదిక ప్రకారం దేశంలో 5,013 బీసీ కులాలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి చెప్తున్న ప్రకారం పెరిగిన ఈ కులాలన్నీ కన్వర్టెడా?
తెలంగాణ ఏర్పాటు అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనల మేరకు ఉమ్మడి ఏపీలో ఉన్న 138 బీసీ కులాల నుంచి తెలంగాణలో లేనటువంటి గుడియా, పోలినాటి వెలమ, తూర్పు కాపు, గాజుల కాపు, అతిరస తదితర సామాజికవర్గాలను తొలగించి 112 సామాజిక వర్గాలను తెలంగాణ బీసీ కులాలుగా జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ఎన్సీబీసీ గుర్తించింది. గ్రూప్ ‘డి’ నుంచి ‘బి’కి, ‘బి’ నుంచి ‘ఏ’కి.. ఇలా అంతర్గత మార్పుల కోసం కూడా పలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది దేశంలో జరిగే సామాజిక పరివర్తన తప్ప కన్వర్టెడ్ కాదు? కాబట్టి రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బీసీలకు క్షమాపణలు చెప్పాలి.
రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన కులగణన సర్వేను సొంత పార్టీ నేతలతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కూడా తప్పుబట్టారు. సర్వేలో తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై, తప్పుడు డాటా నివేదించే అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మరిప్పుడు తప్పుడు నివేదిక తయారు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆయన ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడం లేదు? తెలంగాణ ప్రయోజనాల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు ఏ అంశంలోనూ మోదీతో రేవంత్‌రెడ్డి ఫైట్ చేయలేరు. మోదీతో రేవంత్ ఎప్పుడో కుమ్మక్కయ్యారు. ఈ విషయాలను గ్రహించిన రాహుల్‌గాంధీ తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని తప్పించి, పార్టీకి నమ్మకస్తురాలైన, నిజాయతీకి మారు పేరైన మీనాక్షి నటరాజన్‌కు రాష్ట్ర ఇంచార్జి బాధ్యతలను అప్పగించారు. “No matter how capable a leader is, governing a clan of incompetence and corruption is like steering a ship where the crew is busy drilling holes” అలాగే నిజాయతీకి మారుపేరైన మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి, ఆయన సహచర వర్గంపై వ్యతిరేకత నేపథ్యంలో అవినీతికి ఏమేరకు అడ్డుకట్ట వేస్తారో, బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి.