తెలంగాణ ఆకలికేకలతో అలమటిస్తున్న కాలంలో బువ్వలేని అవ్వ శేపొయ్ దెచ్చి బోనం అండిన రోజులవి. దాహం తీరని పశువులు అసువులు బాసిన దినాలనుంచి స్వరాష్ట్ర పాలనలో అవ్వ ఇంట్ల గుమ్ముల నిండా ధనరాసులు నిండిన స్థితి. మండుటెండల్లో మత్తడి దుంకుతున్న నీటి గలగలలు జూసి గుమ్మపాలు తాగి సెంగలిస్తున్న లేగదూడల జూసినట్టు ఆ దృశ్యరూపం కదలాడుతున్నది. ఈ దృశ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి సాక్షీభూతంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నది.
కేటీఆర్ నేతృత్వంలో ఐటీ రంగం గణనీయంగా ఎదిగింది. తొమ్మిదేండ్లలోనే ఐటీ రంగం రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లోనూ హైదరాబాద్ బెంగళూరును మించిపోయింది.
తెలంగాణలో ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ను అందిస్తున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను నిర్మించి దాని ద్వారా చెరువులు నింపి సాగునీటిని అందిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 20లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాదిమంది కార్మికులు, ఇంజినీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి కేవలం మూడున్నరేండ్ల స్వల్ప కాలంలో పూర్తిచేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరినది నీటిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లు పైకి ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్కనీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పు డు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం లాగా తొణికిసలాడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వ సారథిగా సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమంపై సమగ్ర ప్రణాళికలను రూపొందించి దశలవారీగా అమలు చేశారు. వ్యవసాయరంగ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి. దేశానికే వెన్నెముక అ యిన రైతన్నకు అండగా నిలవాలని ముం దుగానే వ్యూహాన్ని రూపొందించారు. అం దులో భాగంగానే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, ఐటీ రంగానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సా గునీరు అందించి, సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచింది.
ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచడంతో పంట ఉత్పత్తి, ఉత్పాదకత అనేక రెట్లు పెరిగింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటర్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది. దీనికిగాను సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యు త్ సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభు త్వం రూ.36 వేల 179 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో వినూత్న ఒరవడితో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులకు పంట పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరానికి పదివేల చొప్పున అందిస్తున్నది.
రైతుబీమా ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు కు ఒక భరోసానిచ్చింది. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుం డా ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 14న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎలాంటి పైరవీ లేకుండా 20 రోజుల్లోపు రూ.5 లక్షలు ఆ కుటుంబసభ్యుల ఖాతాలో జమవుతున్నాయి. ఈ ఐదేండ్లలో ప్రభుత్వమే మొత్తం ప్రీమియం రూ.5,38 3,83 కోట్లు చెల్లించి 1,00,762 మంది రైతుల కుటుంబాలకు ఎల్ఐసీ చెల్లించింది.
రైతు రుణమాఫీ, ధరణి, మార్కెట్లో రైతులకు సద్దిమూట, హరితహారం, సాదా బైనామాల రిజిస్ట్రేషన్, ప్రతి ఐదువేల జనాభాకు ఒక ఏఈఓ ని యామకం, నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్, రైతు సమితి ఏర్పాటు, విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్, భూసార పరీక్షలు, 2,601 రైతు వేదికలు, 23 వే ల పంట కల్లాలు, ప్రతి ఊరికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.2014లో రూ.1.24 లక్షలున్న తెలంగాణ తలసరి ఆదా యం , 2023 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగింది. దేశంలో ఈ తరహా వృద్ధి ఉన్న మరో రాష్ట్రం లేదు. ఐటీ సెక్టా ర్లో అత్యధిక ఉద్యోగాలను కల్పించిన రాష్ట్రం. దేశంలో మూడో వంతు ఉపాధి అవకాశాలను కల్పించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా వందశా తం శుద్ధిచేసిన తాగునీరందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. విద్యుత్తు కొరత ఉన్న రా ష్ర్టాన్ని మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చిం ది. 100 శాతం ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దింది. దేశ జనాభాలో 3 శాతం కన్నా తక్కువున్న తెలంగాణకు 30 శాతం జాతీ య అవార్డులు దక్కాయి. కేవలం 141 ము న్సిపాలిటీలున్న తెలంగాణ 350కు పైగా మున్సిపాలిటీలున్న మహారాష్ట్రతో సమానం గా అవార్డులు గెలుచుకొన్నది.
ఐటీ ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లు నుంచి రూ.1.87 లక్షల కోట్ల కు పెరుగుదలను నమోదు చేసుకున్నది. మరే రాష్ట్రంలో లేని పారిశ్రామిక వృద్ధి, ఏ రాష్ట్రంలో పెరగనంత హరితవృద్ధి తెలంగాణలో సాధ్యమైం ది. 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగింది. కొత్తగా 5 లక్షల 13 వేల ఎకరాల్లో పచ్చదనం వృద్ధి చెందింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా అవతరించింది. కేటీఆర్ నేతృత్వంలో ఐటీ రంగం గణనీయం గా ఎదిగింది. తొమ్మిదేండ్లలోనే ఐటీ రంగం జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లోనూ హైదరాబాద్ బెంగళూరును మించిపోయింది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పనితీరు వల్లేనని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తు తం ఐటీ ఎగుమతులు 28 శాతం ఉండగా, ఐటీ ఉద్యోగావశాలు 24 శాతం వృద్ధి చెందాయి. 20కి పైగా బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ కేం ద్రంగా పని చేస్తున్నాయి. ఐటీ రంగ ప్రాధాన్యా న్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.ప్రతి ఐదేండ్లకోసారి ఐటీ పాలసీలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ఐటీశాఖ పరిధిలో ఎ మర్జింగ్ టెక్నాల జీవింగ్ను ఏర్పాటు చేసి 8 టెక్నాలజీలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తున్నది.
దేశం అబ్బుర పడేలా తె లంగాణ అద్భుత కట్టడాల ను నిర్మించింది. నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, జి ల్లాల్లో సమీకృత పరిపాల నా భవనాలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అ ద్భుతంగా తీర్చిదిద్దింది. యాదాద్రి, పోలీస్ కమాం డ్ కంట్రోల్ సెంటర్ నిర్మించింది. పదేండ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పసిద్ధితో వందేండ్ల ప్రగతి సాధ్యమైంది.
(వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు )
ఫణి రాజారావు రామినేని
94406 40006